Nara Lokesh: విడాకులు ఉండవు.. పొత్తుపై తేల్చేసిన లోకేష్
ABN , Publish Date - Jan 06 , 2025 | 07:13 PM
Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా కూటమిలోని పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
భీమవరం, జనవరి 06: కూటమిలో మిస్ ఫైర్, క్రాస్ ఫైర్, విడాకులు వంటివి ఉండవని ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. అయితే కూటమిని విడదీసే పనిలో సైకో వైఎస్ జగన్ ఉన్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో బూత్ లెవెల్ నుంచి జాతీయ స్థాయి వరకూ మనమందరం అప్రమత్తంగా ఉండాలన్నారు. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఇటీవల తండ్రిని కోల్పోయిన కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మను ఆయన నివాసంలో నారా లోకేష్ పరామర్శించారు.
అనంతరం కూటమిలోని పార్టీ శ్రేణులతో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ప్రతీ నెల నాలుగు వేల కోట్ల రూపాయిల లోటుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నడుస్తోందన్నారు. రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా తమ ప్రభుత్వం పాలన సాగిస్తుందని చెప్పారు. గత సైకో పాలనలో రాష్ట్రం పూర్తిగా వెనుకబడిందని విమర్శించారు. వంద సంవత్సరాల వెనక్కి పోయిందని ఆయన సోదాహరణగా వివరించారు.
ప్రధాని నరేంద్ర మోదీ.. దేశాభివృద్ధి కోసం పాటుపడుతోన్నారని పేర్కొన్నారు. మీ సమస్యలు ఏమైనా ఉంటే తనకు చెప్పాలని ఆయన కూటమిలోని పార్టీ శ్రేణులకు సూచించారు. అలాగే మీరు తనతో సమన్వయం చేసుకోండి.. లేకుంటే.. మీతో తానే సమన్వయం చేసుకుంటానని వారికి ఈ సందర్బంగా స్పష్టం చేశారు. అంతేకానీ విడాకులు లాంటివి మాత్రం ఉండవని కుండ బద్దలు కొట్టారు.
Also Read: షేక్ హసీనా అరెస్ట్‌కు మళ్లీ వారెంట్ జారీ
Also Read: లోయలో పడిన బస్సు.. నలుగురు మృతి, 32 మందికి గాయాలు
గత ఎన్నికల్లో 94 శాతం సీట్లు ఎన్డీయే కూటమి సాధించిందని చెప్పారు. గత ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని సైకో పాలించాడని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఈ రోజుకూ తెలుగుదేశం పార్టీ అన్ కండిషనల్‌గా కొనసాగుతొందన్నారు. అయితే మనం ఏమి అడిగినా కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తుందని వివరించారు. ఎక్కడైతే పవన్ అన్నపై దాడి చేశారో.. అక్కడే తనపై దాడి చేశారన్నారు. ఆ క్రమంలో నిలబడ్డాం కానీ.. భయపడలేదని ఆయన స్పష్టం చేశారు.
Also Read: తురకా కిషోర్ సోదరులను జైలుకు తరలించిన పోలీసులు
Also Read: రెచ్చిపోయిన మావోయిస్టులు.. భారీ సంఖ్యలో జవాన్లు మృతి
ఎస్ఐ వచ్చి రాత్రికి రాత్రి 52 మందిని రాజమండ్రి జైలుకు పంపించాడన్నారు. 151 స్థానాలు గెలిచిన పార్టీకి 11 స్థానాలను మాత్రమే ప్రజలు ఇచ్చారంటే.. మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయాల్సి ఉందని కూటమిలోని పార్టీల కేడర్‌కు సూచించారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఫించన్ అందిస్తుందని చెప్పారు. రాష్ట్రం కోసం.. దేశ కోసం.. మనం పని చేయాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి డెవలప్డ్ కంట్రీ గా నిలబడాలనేది ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కల అని మంత్రి నారా లోకేష్ గుర్తు చేశారు.
For AndhraPradesh news And Telugu News