Share News

Medical Ethics in India: వ్యాపారంగా మారిన వైద్యం

ABN , Publish Date - Apr 02 , 2025 | 06:25 AM

ఆరోగ్య మంత్రి సత్యకుమార్‌ మాట్లాడుతూ వైద్యం కొన్ని ప్రాంతాల్లో వ్యాపారంగా మారిందని, సేవా భావం తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్యులు సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని, వైద్య వృత్తిలో నైతిక విలువలు పాటించాల్సిన అవసరం ఉందన్నారు

Medical Ethics in India: వ్యాపారంగా మారిన వైద్యం

  • వైద్యులు సేవాభావంతో పని చేయాలి

  • గర్భిణులకు అవసరం లేకుండా సిజేరియన్లు

  • రోగుల ఆలోచన విధానంలో కూడా మార్పు రావాలి

  • ఏపీఎంసీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి సత్యకుమార్‌

అమరావతి, ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి): ‘ఇప్పుడు వైద్యం కొన్ని ప్రాంతాల్లో వ్యాపారంగా మారింది. సేవా భావంతో చేయాల్సిన పని బిజినెస్‌ అయింది’ అని ఆరోగ్య మంత్రి సత్యకుమార్‌ అన్నారు. మంగళవారం ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీలో జరిగిన ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ కౌన్సిల్‌(ఏఎంసీ) నూతన సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డాక్టర్లు జి.సుజాత, కె.వెంకట సుబ్బనాయుడు, డి.శ్రీహరి, స్వర్ణగీత, ఎస్‌.కేశవరావుబాబు, సి.మల్లేశ్వరి ఏఎంసీ సభ్యులుగా మంగళవారం ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ‘వైద్యుల్ని దేవుళ్లతో పోలుస్తారు. దేవుడు ప్రాణం పోస్తే, వైద్యుడు ప్రాణం నిలబెడతాడు. వైద్య వృత్తిలో విలువలు పలుచబడాయి. డాక్టర్లు నైతిక విలువలు పాటించాలి. ఎక్స్‌రే, సీటీ స్కానింగ్‌, ఎంఆర్‌ఐలు రోగులకు అవసరం లేకుండా తీస్తున్నారు. చివరికి గర్భిణులకు సాధారణ ప్రసవాలు చేయడం మానేశారు. డెలివరీ సమయంలో అవసరం లేకపోయినా సిజేరియన్‌ చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రయివేటు వైద్యులు సాధారణ ప్రసవాలు చేస్తే బాగుంటుంది. వైద్యం విషయంలో ప్రజలు ఆలోచన విధానం మారాలి. అనేక పరీక్షలు చేస్తేనే డాక్టరు తమను సరిగ్గా చూసినట్లు ప్రజలు అపోహపడుతున్నారు. అలాంటి వారికి వైద్యులే అవగాహన కల్పించాలి. వైద్యులు తమ వద్దకు వచ్చిన పేషెంట్లను చిరునవ్వుతో పలకరించాలి. పేద రోగులపై ఆర్థిక భారం పడకుండా చూసుకోవాలి. రాష్ట్రంలో ఉన్న వైద్యులంతా తమ సర్టిఫికెట్లను ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ కౌన్సిల్‌లో రెన్యువల్‌ చేసుకోవాలి.


నూతన కౌన్సిల్‌ దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఏపీఎంసీకి మరో నలుగురు ఎక్స్‌ అఫీషియో మెంబర్లు, 13 ఎలక్టెడ్‌ మెంబర్లను ఎన్నుకోవాల్సి ఉంది. మొత్తం 23 మంది సభ్యులు ఏపీఎంసీలో ఉంటారు. మెడికల్‌ కౌన్సిల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ల ఎన్నిక జరగాల్సి ఉంది’ అని మంత్రి సత్యకుమార్‌ అన్నారు. ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్స్‌కు(ఎ్‌ఫఎంజీలకు) రిజిస్ట్రేషన్‌కు సమస్యలున్నాయి. గ్రాడ్యుయేట్స్‌ విషయంలో ఎన్‌ఎంసీ నిబంధనలు అమలు చేయాలి. నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ నిబంధనల్ని ఏపీఎంసీ కచ్చితంగా అమలు చేయాలి’ అని మంత్రి అన్నారు.



ఈ వార్తలు కూడా చదవండి..

CM Chandrababu Comments: బాపట్ల సభలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Kakani Investigation News: రెండో రోజు విచారణకు కాకాణి గైర్హాజరు

Palnadu Crime: యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన యువతి.. ఎందుకంటే

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 02 , 2025 | 06:26 AM