సహనం, దయతో మెలగండి
ABN , Publish Date - Apr 01 , 2025 | 12:37 AM
సహనం, దయతో మెలగండని ముస్లింలకు ప్రభుత్వ ఖాజీ కమాలుల్లా సూచించారు. రంజాన్ పండుగను ముస్లింలు సోమవారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.

ప్రభుత్వ ఖాజీ కమాలుల్లా
భక్తిశ్రద్ధలతో రంజాన్
చిత్తూరు కల్చరల్, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): సహనం, దయతో మెలగండని ముస్లింలకు ప్రభుత్వ ఖాజీ కమాలుల్లా సూచించారు. రంజాన్ పండుగను ముస్లింలు సోమవారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. చిత్తూరు గిరింపేట ఈద్గా మైదానంలో ప్రభుత్వ ఖాజీ కమాలుల్లా ఆధ్వర్యంలో ప్రార్థనలు జరిగాయి. ఆయన ఉపదేశమిస్తూ.. సహనం అన్ని వేళలా మంచిదని చెప్పారు. ఇతరుల పట్ల ఆదరణ చూపించి అల్లా ఆశీర్వాదం పొందాలన్నారు. ప్రార్థనల అనంతరం పిల్లలు, పెద్దలు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు.