Share News

Chandrababu: వీర జవాన్ కార్తీక్ మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం..

ABN , Publish Date - Jan 21 , 2025 | 11:37 AM

జమ్మూ కాశ్మీర్‌లో సోమవారం చోటు చేసుకున్న ఉగ్రవాదుల కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా కు చెందిన వీర జవాన్ కార్తీక్ మృతి చెందారు. చిత్తూరు జిల్లా, బంగారువాండ్లపల్లె మండలం, ఎగువ రాగి మానుపెంటకు చెందిన కార్తీక్ ఎదురు కాల్పుల్లో తీవ్రంగా గాయపడి వీరమరణం చెందారు.

Chandrababu: వీర జవాన్ కార్తీక్ మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం..
CM Chandrababu

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లాకు చెందిన జవాన్ కార్తీక్ మృతి చెందిన వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్ కార్తీక్ సంతాపం ప్రకటిస్తూ.. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని, ఆ కుటుంబానికి ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నానని చంద్రబాబు ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు.

చిత్తూరు జిల్లాకు చెందిన జవాన్ కార్తీక్ మృతి కావడం బాధాకరమని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. దేశ రక్షణ కోసం అమరుడైన జవాన్ చేసిన సేవలు చిరస్మరణీయంగా ఉంటాయని, ఆయన కుటుంబానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కార్తీక్ కుటుంబానికి ప్రభుత్వం పరంగా అండగా ఉంటామని మంత్రి స్పష్టం చేశారు.

ఈ వార్త కూడా చదవండి..

ప్రముఖ ప్రొడ్యూసర్స్ నివాసాల్లో ఐటీ సోదాలు..


కాగా జమ్మూ కాశ్మీర్‌ (Jammu, Kashmir)లో సోమవారం చోటు చేసుకున్న ఉగ్రవాదుల కాల్పుల్లో (Militant Encounter) ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) చిత్తూరు జిల్లా (Chittoor Dist.)కు చెందిన వీర జవాన్ (Jawan) కార్తీక్ మృతి (Died) చెందారు. చిత్తూరు జిల్లా, బంగారువాండ్లపల్లె మండలం, ఎగువ రాగి మానుపెంటకు చెందిన కార్తీక్ ఎదురు కాల్పుల్లో తీవ్రంగా గాయపడి వీరమరణం చెందారు. వరదరాజులు, సెల్వి దంపతుల చిన్న కుమారుడు కార్తీక్ (29) డిగ్రీ చదువుకుంటూ ఆర్మీలో 2017 లో చేరారు. దీపావళీ పండుగకు ఇంటికి వచ్చి వారం రోజుల పాటు కుటుంబ సభ్యులు, స్నేహితులతో సరదాగా గడిపారు. తిరిగి మే నెల లో ఇంటికి వస్తానని చెప్పి కార్తీక్ డ్యూటీకి వెళ్లాడు. ఇంతలో ఈ వార్త ఆయన కుటుంబంలో విషాదం నింపింది. సోమవారం మధ్యాహ్నం జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన జవాను చికిత్స పొందుతూ మృతి చెందారు. కార్తీక్ మృతితో కుటుంబంలోనూ, గ్రామంలోనూ విషాదఛాయలు అలుముకున్నాయి.

పూర్తి వివరాలు.. జమ్మూ కాశ్మీర్‌, సోపోర్‌లోని, జలూర గుజ్జార్‌పట్టి ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికల గురించి భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీంతో ఇండియన్ ఆర్మీ, జమ్మూ కశ్మీర్ పోలీసులు జాయింట్ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ క్రమంలోనే భద్రతా బలగాలు ఉగ్రవాదుల అనుమానస్పద కార్యకలాపాలను గమనించాయి. అది గమనించిన ఉగ్రవాదుల కాల్పులు ప్రారంభించారు.. భద్రతాబలగాలు కూడా సమర్దవంతంగా ఎదురుకాల్పులు జరిపాయి. ఈ ఘటనలో చిత్తూరు జిల్లాకు చెందిన కార్తీక్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అతనిని వైద్య చికిత్స కోసం ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే ఆస్పత్రికి తరలిస్తుండగా కార్తీక్ మరణించారు.


విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన వీరజవాన్ కార్తీక్ త్యాగానికి చినార్ కార్ప్స్ అన్ని ర్యాంకులు వందనాలు అర్పిస్తున్నాయి. చినార్ వారియర్స్ అతని అపారమైన పరాక్రమం, త్యాగానికి సెల్యూట్ చేస్తూ, ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. మృతుని కుటుంబానికి సంఘీభావం తెలుపుతున్నట్లు భారత ఆర్మీకి చెందిన చినార్ కార్ప్స్ సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా పోస్టు చేసింది. కార్తీక్ మృతదేహం మంగళవారం స్వగ్రామానికి చేరుకోనుంది. కుటుంబ సభ్యులో ఈరోజే అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం.

కాగా మంగళవారం ఉదయం బెంగలూరు ఎయిర్ పోర్టుకు కార్తీక్ పార్ధివదేహం చేరుకుంది. అక్కడి నుంచి ఆర్మీ అధికారులు కార్తీక్ స్వగ్రామం బంగారువాండ్లపల్లెకు తీసుకువచ్చారు. ఈరోజే అంత్యక్రియలు జరుగుతాయి. ఈ క్రమంలో గ్రామంలో విషాదచారయలు అలుముకున్నాయి. దేశం కోసం ప్రాణాలు అర్పించాడు. ఆయన త్యాగం మరువలేనిదంటూ గ్రామస్తులు, కార్తీక్ స్నేహితులు పెద్ద ఎత్తున నివాళులర్పిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అధికారుల సమావేశం.. రమ్మీ ఆడుతున్న డీఆర్వో

అట్టహాసంగా ప్రారంభమైన వరల్డ్ ఎకనికమిక్ ఫోరం సదస్సు

కాశ్మీర్: ఉగ్రవాదుల కాల్పుల్లో ఆంధ్రా జవాన్ మృతి

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 21 , 2025 | 11:41 AM