CM Chandrababu : సీఎం చంద్రబాబు మరో సంచలన నిర్ణయం
ABN , Publish Date - Mar 21 , 2025 | 06:52 PM
CM Chandrababu: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత తిరుమల ప్రక్షాళనపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగానే మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.

తిరుపతి: తిరుపతిలోని అలిపిరి వద్ద ఏర్పాటు చేసే ముంతాజ్ హోటల్ నిర్మాణానికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అనుమతి రద్దు చేశారు. ఈ నిర్ణయంపై భక్తులు సర్వత్ర హర్షం వ్యక్తం చేశారు. ముంతాజ్ హోటల్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ అనేక హిందూ సంస్థలు ఆందోళనలు చేసిన విషయం తెలిసిందే. హిందువుల మనోభావాలను అర్థం చేసుకున్న సీఎం చంద్రబాబు ఈరోజు అలిపిరి వద్ద ఉన్న 35 ఎకరాల స్థలాన్ని టీటీడీకే కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
అలిపిరి వద్ద చంద్రబాబుకు హిందూ సంస్థల ప్రతినిధులు పాదాభివందనం కార్యక్రమం చేపట్టారు. కొబ్బరికాయలు కొట్టి హిందూ సంఘాల ప్రతినిధులు మొక్కులు తీర్చుకున్నారు. నడిచి వెళ్తున్న భక్తులకు స్వీట్లు పంపిణీ చేశారు. చంద్రబాబు తన మనవడి పుట్టినరోజు సందర్భంగా తిరుమలకు వచ్చారు. తిరుమల పర్యటన సందర్భంగా ఈ జీవో రద్దు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు కూడా హిందూ సంఘాల ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
Marri Rajasekhar: నన్ను అవమానించారు.. విడదల రజినీపై మర్రి రాజశేఖర్ ఫైర్
Vamsi Bail Petition: వంశీ.. మరో ఐదు రోజులు ఆగాల్సిందే
CM Chandrababu: అప్పుడే వెంకటేశ్వర స్వామి మహిమ ఏంటో అందరికీ తెలిసింది..
Read Latest AP News And Telugu News