Deputy Mayor election: తిరుపతిలో హై టెన్షన్ .. అసలు ఏం జరుగుతోంది..
ABN , Publish Date - Feb 03 , 2025 | 09:29 AM
Tirupati Deputy Mayor election: తిరుపతిలో హై టెన్షన్ నెలకొంది. వైసీపీ టీడీపీ కార్పొరేటర్ల మధ్య వివాదం మరోసారి రాజుకుంది. ఆదివారం అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు హైడ్రామా నడిచింది. తిరుపతిలో కార్పొరేటర్లతో కూటమి, వైసీపీ స్పెషల్ క్యాంప్స్ నిర్వహించింది.

తిరుపతి: తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌లో డిప్యూటీ మేయర్ ఎన్నికల రగడ రాజుకుంది. ఇవాళ(సోమవారం) ఉదయం 11 గంటలకు తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ సెలెక్ట్ హాల్లో ఎన్నిక ప్రక్రియ జరుగనుంది. అయితే పాండిచేరిలోని రిసార్ట్‌లో వైసీపీ నేతలు ఇప్పటివరకు క్యాంపు నిర్వహించారు. ఇవాళ ఎన్నిక జరుగుతుండటంతో చిత్తూరులోని ఓ హోటల్‌కు వైసీపీ కార్పొరేటర్లు వెళ్లారు. ఓ పెళ్లికి వచ్చినట్లుగా తమకు తాముగా గదులు తీసుకుని ఆ గెస్ట్‌హౌస్‌లో వైసీపీ కార్పొరేటర్లు బస చేశారు. వైసీపీ కార్పొరేటర్లు చిత్తూరు హోటల్లో ఉన్నారని టీడీపీ నేతలు తెలుసుకున్నారు. వైసీపీ కార్పొరేటర్లతో చర్చించేందుకు ఆ హోటల్‌కు కూటమి నేతలు వెళ్లారు.
ఈ విషయం తెలుసుకుని అక్కడకు వైసీపీ ఇన్‌చార్జి భూమన అభినయ రెడ్డి చేరుకున్నారు. అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు హైడ్రామా నడిచింది. చిత్తూరు నుంచి వైసీపీ కార్పొరేటర్లను తీసుకుని అభినయ రెడ్డి వెళ్లిపోయారు. ఒక వైసీపీ నేతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ నేత పోలీస్ స్టేషన్‌లో ఉన్నాడని తెలియడంతో పోలీస్ స్టేషన్‌పైకి కూడా వైసీపీ నేతలు దండయాత్ర చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఇంటి నుంచి తమను కదలనీయకుండా వైసీపీ నేతలు అడ్డుకున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. దిష్టిబొమ్మ దగ్ధం చేశారని టీడీపీ నేతలపై హత్య కేసులు పెట్టారు. కార్పొరేషన్ ఎన్నికల్లో నామినేషన్ కూడా వేయకుండా వైసీపీ గుండాలు నడిరోడ్డుపై నామినేషన్ పత్రాలను చించివేశారు. ఈ విషయంపై చిత్తూరు హోటల్లో అభినయ రెడ్డిని కూటమి నేతలు నిలదీశారు.
ఈ వార్తలు కూడా చదవండి
CM Chandrababu: ఆ నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్
AP News: ఆ పదవి కోసం మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి వ్యూహం
Read Latest AP News And Telugu News