Share News

సీఎం పర్యటనకు భారీ బందోబస్తు

ABN , Publish Date - Mar 20 , 2025 | 01:48 AM

సీఎం చంద్రబాబు పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రేణిగుంట విమానాశ్రయంలో పారా మిలటరీ బలగాలు మోహరించాయి. తిరుమల, తిరుపతిలో అడుగడుగునా తనిఖీలు చేస్తున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుమలకు వెళ్లే అన్ని మార్గాల్లోని కల్వర్టులు, బ్రిడ్జిలు, రోడ్లకు ఇరువైపులా బాంబు స్క్వాడ్లు తనిఖీలు చేస్తుండగా.. రోడ్డు డిగ్గింగ్‌ పార్టీలు అనుమానిత ప్రాంతాల్లో రోడ్లు తవ్వి పరిశీలిస్తున్నాయి. ఇక, గరుడ సర్కిల్‌ నుంచి తిరుమల ఘాట్‌ రోడ్లలో రిజర్వు బలగాలు తనిఖీలు చేస్తున్నాయి.

సీఎం పర్యటనకు భారీ బందోబస్తు
శ్రీవారి ఆలయం ముందు భద్రతాంశాలపై చర్చిస్తున్న ఎస్పీ హర్షవర్ధన్‌రాజు, అధికారులు

. పారా మిలటరీ బలగాలతో కూంబింగ్‌

. పోలీసుల అదుపులో 40 మంది అనుమానితులు

తిరుపతి(నేరవిభాగం)/తిరుమల, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రేణిగుంట విమానాశ్రయంలో పారా మిలటరీ బలగాలు మోహరించాయి. తిరుమల, తిరుపతిలో అడుగడుగునా తనిఖీలు చేస్తున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుమలకు వెళ్లే అన్ని మార్గాల్లోని కల్వర్టులు, బ్రిడ్జిలు, రోడ్లకు ఇరువైపులా బాంబు స్క్వాడ్లు తనిఖీలు చేస్తుండగా.. రోడ్డు డిగ్గింగ్‌ పార్టీలు అనుమానిత ప్రాంతాల్లో రోడ్లు తవ్వి పరిశీలిస్తున్నాయి. ఇక, గరుడ సర్కిల్‌ నుంచి తిరుమల ఘాట్‌ రోడ్లలో రిజర్వు బలగాలు తనిఖీలు చేస్తున్నాయి. ఎస్టీఎఫ్‌ బలగాలు శేషాచలం అడవుల్లో కూంబింగ్‌ చేపట్టాయి. తిరుపతి, తిరుమలలో తనిఖీలు చేసిన పోలీసులు ఇప్పటికే దాదాపు 40 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. అనంతపురం డీఐజీ షిమోషీ నేతృత్వంలో ఇద్దరు ఎస్పీల పర్యవేక్షణలో ముగ్గురు అదనపు ఎస్పీలు, 25 మంది డీఎస్పీలు, 56 మంది సీఐలు, 100 మంది ఎస్‌ఐలు, ఏఎ్‌సఐలు, హెడ్‌ కానిస్టేబుళ్ళతో పాటు మరో 200 మంది పోలీసులు, రిజర్వు బలగాలు, డాగ్‌, బాంబు స్క్వాడ్‌లు, హోంగార్డులు, మహిళా పోలీసులు, ఎస్టీఎఫ్‌ బలగాలు సీఎం బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు. మరోవైపు విమానాశ్రయం నుంచి తిరుమల వరకు భద్రతా సిబ్బంది సీఎం కాన్వాయ్‌ ట్రయల్‌రన్‌ నిర్వహించారు. సీఎం బస చేసే పద్మావతి అతిథిగృహం, కాన్వాయ్‌ ప్రయాణించే మార్గాలు, శ్రీవారి ఆలయం, అన్నప్రసాద భవనాల్లో ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తిరుమల పోలీసు, విజిలెన్స్‌ అధికారులతో కలిసి ఎస్పీ హర్షవర్ధన్‌రాజు శ్రీవారి ఆలయం, పరిసర ప్రాంతాలు, ఘాట్‌రోడ్లలో తనిఖీలు నిర్వహించి భద్రతాపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అన్నప్రసాద భవనంలో తనిఖీలు నిర్వహించారు. కాగా, సీఎంతో పాటు మంత్రులు అనగాని సత్యప్రసాద్‌, ఆనం రామనారాయణరెడ్డి తిరుమలకు రానున్నారు.

Updated Date - Mar 20 , 2025 | 01:48 AM