మున్సిపల్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం
ABN , Publish Date - Mar 20 , 2025 | 01:43 AM
వెంకటగిరి వైసీపీలో ‘అవిశ్వాస’ కుంపటి రాజుకుంది. మున్సిపల్ చైర్‌పర్సన్ పదవి దక్కించుకునేందుకు కౌన్సిలర్ దొంతు శారద శరవేగంగా పావులు కదుపుతున్నారు. ప్రస్తుత చైర్‌పర్సన్ నక్కా భానుప్రియపై అవిశ్వాసానికి సొంత పార్టీలోని కౌన్సిలర్ల మద్దతు కూడగట్టారు. 16 మంది కౌన్సిలర్లతో అవిశ్వాస తీర్మాన నోటీసులపై సంతకాలు చేయించి బుధవారం కలెక్టరు వెంకటేశ్వర్‌కు అందజేశారు. అవిశ్వాసం ప్రవేశ పెట్టడానికి సరిపడా కౌన్సిలర్ల మద్దతు కూడగట్టిన శారద.. ఆ తర్వాత సంపూర్ణ మద్దతు కూడగట్టే పనిలో ఉన్నారు. దీనికి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, కూటమి నేతల మద్దతు ఆమెకు ఉన్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. గత మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ నుంచి కౌన్సిలరుగా గెలిచిన దొంతు శారద అప్పట్లో చైర్‌పర్సన్ పదవి ఆశించారు. అప్పటి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి 24వ వార్డు కౌన్సిల్ నక్కా భానుప్రియను ఎంపిక చేశారు.

. తీర్మానంపై 16 మంది కౌన్సిలర్ల సంతకాలు
. వేడెక్కుతున్న వెంకటగిరి మున్సిపల్ రాజకీయం
. సొంతపార్టీలో కుంపటిని ఆర్పేపనిలో నేదురుమల్లి
వెంకటగిరి, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): వెంకటగిరి వైసీపీలో ‘అవిశ్వాస’ కుంపటి రాజుకుంది. మున్సిపల్ చైర్‌పర్సన్ పదవి దక్కించుకునేందుకు కౌన్సిలర్ దొంతు శారద శరవేగంగా పావులు కదుపుతున్నారు. ప్రస్తుత చైర్‌పర్సన్ నక్కా భానుప్రియపై అవిశ్వాసానికి సొంత పార్టీలోని కౌన్సిలర్ల మద్దతు కూడగట్టారు. 16 మంది కౌన్సిలర్లతో అవిశ్వాస తీర్మాన నోటీసులపై సంతకాలు చేయించి బుధవారం కలెక్టరు వెంకటేశ్వర్‌కు అందజేశారు. అవిశ్వాసం ప్రవేశ పెట్టడానికి సరిపడా కౌన్సిలర్ల మద్దతు కూడగట్టిన శారద.. ఆ తర్వాత సంపూర్ణ మద్దతు కూడగట్టే పనిలో ఉన్నారు. దీనికి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, కూటమి నేతల మద్దతు ఆమెకు ఉన్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. గత మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ నుంచి కౌన్సిలరుగా గెలిచిన దొంతు శారద అప్పట్లో చైర్‌పర్సన్ పదవి ఆశించారు. అప్పటి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి 24వ వార్డు కౌన్సిల్ నక్కా భానుప్రియను ఎంపిక చేశారు. గడిచిన నాలుగేళ్లలో మున్సిపాలిటీలో పెద్దగా పనులు జరగకపోవడంతో సొంత పార్టీ కౌన్సిలర్లే చైర్‌పర్సన్‌ను వ్యతిరేకిస్తూ వచ్చారు. ఇక, చైర్స్‌పర్సన్ బావ నక్కా వెంకటేశ్వరావు పెత్తనంపై పలు సమావేశాల్లో సొంత పార్టీ కౌన్సిలర్లు నిలదీశారు. అయినా, అతడిలో మార్పులేకపోవడం.. చైర్‌పర్సన్ నక్కా భానుప్రియపై అసమ్మతి పెరిగేలా చేసింది. దీన్ని తమకు అనుకూలంగా శారద మార్చుకున్నారు. మరోవైపు ఈమెకు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, ప్రముఖ పారిశ్రామికవేత్త గంగాప్రసాద్ పరోక్ష సహకారం అందిస్తున్నట్లు తెలుస్తోంది. తిరుమలకు సీఎం చంద్రబాబు రానున్న నేపథ్యంలో వెంకటగిరి మున్సిపల్ రాజకీయాల గురించి టీడీపీ నేతలు చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇక, సొంత పార్టీలో రేగిన ‘అవిశ్వాస చిచ్చు’ను ఆర్పే పనిలో నియోజకవర్గ ఇన్‌చార్జి నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి ఉన్నట్లు సమాచారం. దీనికోసం ఆయన గురువారం వెంకటగిరి వస్తున్నట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి.
మున్సిపాలిటీలో బలాబలాలిలా
వెంకటగిరి మున్సిపాల్టీలోని మొత్తం 25 వార్డుల్లో వైసీపీ కౌన్సిలర్లే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు 5, 4, 7 వార్డుల కౌన్సిలర్లు టీడీపీ గూటికి చేరారు. మిగిలి 22 మంది కౌన్సిలర్లు వైసీపీలోనే కొనసాగుతూ వచ్చారు. ఈ నెల 17వ తేదికి పాలకవర్గం ఏర్పడి నాలుగేళ్లు పూర్తి కావడంతో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టే అవకాశం ఏర్పడింది. దీంతో బుధవారం కలెక్టర్ వెంకటేశ్వర్‌ను కలిసి 16 మంది కౌన్సిలర్ల సంతకాలతో అవిశ్వాసంపై నోటీసులిచ్చారు. దీనిపై ఆయన సమావేశ తేదీని ఖరారు చేయాల్సి ఉంది.