భక్తులను పద్మావతి పార్కులోకి ఎందుకు పంపారు?
ABN , Publish Date - Mar 20 , 2025 | 01:45 AM
తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై టీటీడీ పూర్వ జేఈవో గౌతమిని ఏకసభ్య న్యాయవిచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ సత్యనారాయణమూర్తి సుదీర్ఘంగా విచారించారు. బుధవారం ఉదయం 10.30నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ విచారణ సాగింది. ‘వైకుంఠ ఏకాదశికి తిరుమలకు లక్షల్లో భక్తులు వస్తారు. టోకెన్ల కోసం పెద్దసంఖ్యలో వస్తారని తెలుసుకదా? మీరు తీసుకున్న యాక్షన్ ప్లాన్ ఏమిటి? టికెట్ల కేటాయింపునకు ప్రభుత్వ హైస్కూల్ కేటాయిస్తే.. భక్తులను పద్మావతి పార్కులోకి ఎందుకు పంపించారు? తొక్కిసలాట సమయంలో మీరెక్కడ ఉన్నారు? ఘటనా స్థలానికి ఎందుకు రాలేదు? పార్కు తాళాలు ఎవరు వేశారు?’ ఇలా వివిధ అంశాలపై జస్టిస్ సత్యనారాయణమూర్తి ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. ‘పెద్దసంఖ్యలో భక్తులు వస్తారని తిరుమల, తిరుపతిలోని పరిపాలన భవనంలో భక్తులకు టోకెన్ల కేటాయింపు విషయంపై పలుమార్లు సమీక్ష నిర్వహించాం. యాక్షన్ ప్లాన్‌నూ సిద్ధం చేశాం. భైరాగిపట్టెడ పార్కు నా పరిధిలోకి రాదు. సంఘటన జరిగినప్పుడు నేను జీవకోనలోని టోకెన్ల కేంద్రంలో ఉన్నాను. ఘటన జరిగిన వెంటనే స్విమ్స్‌కు వెళ్లా’ అని గౌతమి చెప్పినట్లు సమాచారం.

ఫ తొక్కిసలాట సమయంలో మీరు ఎక్కడ ఉన్నారు?
ఫ పూర్వ జేఈవో గౌతమిపై కమిషన్ ప్రశ్నల వర్షం
ఫ న్యాయవాదులతో విచారణకు వచ్చిన పోలీసులు
ఫ దాదాపు వంద మంది విచారణకు హాజరు
తిరుపతి(కలెక్టరేట్), మార్చి 19(ఆంధ్రజ్యోతి): తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై టీటీడీ పూర్వ జేఈవో గౌతమిని ఏకసభ్య న్యాయవిచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ సత్యనారాయణమూర్తి సుదీర్ఘంగా విచారించారు. బుధవారం ఉదయం 10.30నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ విచారణ సాగింది. ‘వైకుంఠ ఏకాదశికి తిరుమలకు లక్షల్లో భక్తులు వస్తారు. టోకెన్ల కోసం పెద్దసంఖ్యలో వస్తారని తెలుసుకదా? మీరు తీసుకున్న యాక్షన్ ప్లాన్ ఏమిటి? టికెట్ల కేటాయింపునకు ప్రభుత్వ హైస్కూల్ కేటాయిస్తే.. భక్తులను పద్మావతి పార్కులోకి ఎందుకు పంపించారు? తొక్కిసలాట సమయంలో మీరెక్కడ ఉన్నారు? ఘటనా స్థలానికి ఎందుకు రాలేదు? పార్కు తాళాలు ఎవరు వేశారు?’ ఇలా వివిధ అంశాలపై జస్టిస్ సత్యనారాయణమూర్తి ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. ‘పెద్దసంఖ్యలో భక్తులు వస్తారని తిరుమల, తిరుపతిలోని పరిపాలన భవనంలో భక్తులకు టోకెన్ల కేటాయింపు విషయంపై పలుమార్లు సమీక్ష నిర్వహించాం. యాక్షన్ ప్లాన్‌నూ సిద్ధం చేశాం. భైరాగిపట్టెడ పార్కు నా పరిధిలోకి రాదు. సంఘటన జరిగినప్పుడు నేను జీవకోనలోని టోకెన్ల కేంద్రంలో ఉన్నాను. ఘటన జరిగిన వెంటనే స్విమ్స్‌కు వెళ్లా’ అని గౌతమి చెప్పినట్లు సమాచారం. దీంతోపాటు సుమారు 5 పేజీల వరకు ఆమె కమిషన్‌కు వాంగ్మూలం ఇచ్చారు. తొక్కిసలాట ఘటనలో సస్పెండైన డీఎస్పీ రమణకుమార్ తరఫున న్యాయవాదులు కమిషన్ ఎదుట గౌతమిని క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. మరోవైపు తొక్కిసలాట ఘటనలో కీలకంగా మారిన 16మంది బాధితులను రెండోసారి విచారణకు పిలిచారు. ఓజిలికి చెందిన కృష్ణమ్మ, ఉమ్మడి చిత్తూరు జిల్లా రామసముద్రం మండలానికి చెందిన మరో ఇద్దరిని విచారించారు. పోలీసులు, టీటీడీ నిర్లక్ష్యంగా కారణంగా తాము తీవ్రంగా గాయపడ్డామని వారు కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. ఇక, మధ్యాహ్నం తర్వాత నలుగురిని మాత్రమే విచారించారు. కాగా, తొక్కిసలాట సమయంలో విధుల్లో ఉన్న అప్పటి ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ సీవీఎస్వో శ్రీధర్, సస్పెండైన డీఎస్పీ రమణకుమార్, ఎస్వీ గోశాల మాజీ డైరెక్టర్ హరినాథరెడ్డితో పాటు డీఎస్పీ నుంచి కానిస్టేబుల్ స్థాయి వరకు జనవరి 8న పద్మావతి పార్కు వద్ద విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది, టీటీడీ విజిలెన్స్, ఉద్యోగులు సుమారు 90మందిని కూడా కలెక్టరేట్‌లోని వీడియో కాన్పరెన్స్ హాల్‌లో విచారణకు పిలిపించారు. సమయం లేకపోవడంతో గురువారం వీరంతా కమిషన్ ఎదుట హాజరు కానున్నారు. కాగా, విచారణ నేపథ్యంలో నాడు విధుల్లో ఉన్న టీటీడీ సీవీఎస్వో శ్రీధర్, పలువురు డీఎస్పీలు, సీఐలు తమవెంట లాయర్లను తెచ్చుకున్నారు. కమిషన్ ఎదుట ఎలా వాంగ్మూలం ఇవ్వాలనే దానిపై వారితో చర్చిస్తూ కనిపించారు. తొక్కిసలాట ఘటనపై తిరుపతి కలెక్టరేట్ వేదికగా మరో మూడు రోజుల పాటు విచారణ సాగనుంది.