నేడు సంస్కృత వర్సిటీ స్నాతకోత్సవం
ABN , Publish Date - Mar 20 , 2025 | 01:40 AM
: తిరుపతిలోని జాతీయ సంస్కృత వర్సిటీ నాలుగో స్నాతకోత్సవం గురువారం జరగనుంది. మహతిలో ఉదయం 10 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో భారత మాజీ ఎన్నికల ప్రధానాధికారి, పద్మవిభూషణ్ గ్రహీత ఎన్.గోపాలస్వామి హాజరు కానున్నారు. పలువురికి బంగారు పతకాలు, స్నాతకోత్తర డిగ్రీలు, బిరుదులు, పట్టాలు ప్రదానం చేయనున్నారు. ఈ స్నాతకోత్సవంలో వర్సిటీ మాజీ ఛాన్స్‌లర్ డాక్టర్ వీఆర్ పంచముఖి ముఖ్య అతిథిగా పాల్గొంటారు. మొత్తం 564 మంది విద్యార్థులు స్నాతకోత్సవ పట్టాలు స్వీకరించనున్నారు. స్నాతకోత్సవానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు వీసీ ప్రొఫెసర్ జీఎ్‌సఆర్ కృష్ణమూర్తి బుధవారం మీడియా సమావేశంలో తెలిపారు. కాలానుగుణంగా యూనివర్సిటీ అనేక మార్పులు చేర్పులు చేసిందన్నారు. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు దేశ, విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారన్నారు.

తిరుపతి (విశ్వవిద్యాలయాలు), మార్చి 19 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలోని జాతీయ సంస్కృత వర్సిటీ నాలుగో స్నాతకోత్సవం గురువారం జరగనుంది. మహతిలో ఉదయం 10 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో భారత మాజీ ఎన్నికల ప్రధానాధికారి, పద్మవిభూషణ్ గ్రహీత ఎన్.గోపాలస్వామి హాజరు కానున్నారు. పలువురికి బంగారు పతకాలు, స్నాతకోత్తర డిగ్రీలు, బిరుదులు, పట్టాలు ప్రదానం చేయనున్నారు. ఈ స్నాతకోత్సవంలో వర్సిటీ మాజీ ఛాన్స్‌లర్ డాక్టర్ వీఆర్ పంచముఖి ముఖ్య అతిథిగా పాల్గొంటారు. మొత్తం 564 మంది విద్యార్థులు స్నాతకోత్సవ పట్టాలు స్వీకరించనున్నారు. స్నాతకోత్సవానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు వీసీ ప్రొఫెసర్ జీఎ్‌సఆర్ కృష్ణమూర్తి బుధవారం మీడియా సమావేశంలో తెలిపారు. కాలానుగుణంగా యూనివర్సిటీ అనేక మార్పులు చేర్పులు చేసిందన్నారు. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు దేశ, విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారన్నారు.