Share News

ఆర్టీసీ బస్సెక్కి.. హంగామా చేసి!

ABN , Publish Date - Mar 20 , 2025 | 01:38 AM

ఆర్టీసీ బస్సెక్కారు. మహిళలకు ఉచిత ప్రయాణమని చెప్పారంటూ టికెట్‌ తీసుకునేది లేదని వాదనకు దిగారు. కండక్టర్‌ విధులకు ఆటంకం కలిగించిన ఘటనలో తిరుపతి మేయర్‌ శిరీష సహా 25 మంది వైసీపీ నేతలపై బుధవారం కేసులు నమోదయ్యాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ నెరవేర్చాలంటూ తిరుపతిలో వైసీపీ నాయకులు నిరసన తెలిపారు. మేయర్‌ శిరీష, భూమన అభినయ్‌, టౌన్‌బ్యాంకు చైర్మన్‌ జయచంద్రారెడ్డి, వైస్‌ చైర్మన్‌ సహదేవ యాదవ్‌, నగర పార్టీ అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, మహిళా ఉపాధ్యక్షురాలు గీత యాదవ్‌ తదితరులు ఆర్టీసీ బస్టాండు వద్ద పీలేరు వెళ్లే పల్లెవెలుగు బస్సు ఎక్కారు. బస్సు లీలామహల్‌ వద్దకు రాగానే కండక్టర్‌ టికెట్‌ అడిగారు.

ఆర్టీసీ బస్సెక్కి.. హంగామా చేసి!
ఆర్టీసీ బస్సులో వైసీపీ నేతలు

- కండక్టర్‌ విధులకు ఆటంకం

  • తిరుపతి మేయర్‌ సహా 25 మందిపై కేసు

తిరుపతి(నేరవిభాగం), మార్చి 19(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ బస్సెక్కారు. మహిళలకు ఉచిత ప్రయాణమని చెప్పారంటూ టికెట్‌ తీసుకునేది లేదని వాదనకు దిగారు. కండక్టర్‌ విధులకు ఆటంకం కలిగించిన ఘటనలో తిరుపతి మేయర్‌ శిరీష సహా 25 మంది వైసీపీ నేతలపై బుధవారం కేసులు నమోదయ్యాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ నెరవేర్చాలంటూ తిరుపతిలో వైసీపీ నాయకులు నిరసన తెలిపారు. మేయర్‌ శిరీష, భూమన అభినయ్‌, టౌన్‌బ్యాంకు చైర్మన్‌ జయచంద్రారెడ్డి, వైస్‌ చైర్మన్‌ సహదేవ యాదవ్‌, నగర పార్టీ అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, మహిళా ఉపాధ్యక్షురాలు గీత యాదవ్‌ తదితరులు ఆర్టీసీ బస్టాండు వద్ద పీలేరు వెళ్లే పల్లెవెలుగు బస్సు ఎక్కారు. బస్సు లీలామహల్‌ వద్దకు రాగానే కండక్టర్‌ టికెట్‌ అడిగారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమని హామీ ఇచ్చారంటూ టికెట్‌ తీసుకునేది లేదన్నారు. టికెట్‌ ఇవ్వకుంటే దిగేయండని చెప్పారు. దీనిపై కాసేపు కండక్టర్‌ దామోదర్‌కు, వైసీపీ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కండక్టర్‌ టికెట్లు కొట్టకుండా అడ్డుకోవడంతో డ్రైవర్‌ బస్సును ఆపేశారు. పీలేరు డిపో కండక్టర్‌ దామోదర్‌ ఫిర్యాదు మేరకు 25 మందిపై తిరుపతి ఈస్ట్‌ పోలీసులు కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కొందరిని ఎస్వీయూ స్టేషన్‌కు.. మరికొందరిని ఈస్ట్‌ స్టేషన్‌కు తరలించారు. 41 నోటీసులు అందచేసి సొంత పూచీకత్తులపై విడుదల చేసినట్లు ఈస్ట్‌ సీఐ రామకృష్ణ చెప్పారు. ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించినా.. ముందస్తు అనుమతులు లేకుండా ధర్నాలు, ఆందోళనలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఆర్టీసీ డ్రైవర్లు,

కండక్టర్లు అప్రమత్తంగా ఉండాలి

తిరుపతి(ఆర్టీసీ), మార్చి 19 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రకటన వచ్చే వరకు డ్రైవర్లు, కండక్టర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని డీపీటీవో నరసింహులు, డిప్యూటీ సీటీఎం విశ్వనాథం ఆదేశించారు. బుధవారం వీరు 11 డిపోల మేనేజర్లతో జూమ్‌ మీటింగ్‌ నిర్వహించారు. ప్రయాణికుల కదలికలపై దృష్టిపెట్టాలని, వారివద్ద జెండాలు, బ్యానర్లు వంటివి ఉన్నాయా గమనించాలని, అనుమానం కలిగితే పై అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. మార్గమధ్యలో ఎవరైనా ఆందోళన చేస్తే బస్సును నేరుగా సమీప పోలీ్‌సస్టేషన్‌కు తరలించాలని సూచించారు.

Updated Date - Mar 20 , 2025 | 01:38 AM