సబ్సిడీ రుణాలకు తీవ్ర పోటీ
ABN , Publish Date - Mar 20 , 2025 | 01:31 AM
రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన సబ్సిడీ రుణాలకు తీవ్ర పోటీ నెలకొంది. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లుగా పేద, నిరుద్యోగ యువతను గాలికొదిలేయడంతో ఎప్పుడూ లేనంతగా వివిధ కులాల లబ్ధిదారులు పెద్దఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్న 2014 - 19 సంవత్సరాల మధ్య ఎస్సీ, ఎస్టీ, బీసీ, కమ్మ, కాపు, తదితర కులాల కార్పొరేషన్లకు పెద్దఎత్తున సబ్సిడీ రుణాలను మంజూరు చేసింది.ఏటా అన్ని కార్పొరేషన్లకు కలిపి 25వేల మందికి రుణాలను మంజూరు చేసేది. ఒక్కో లబ్ధిదారుడికి యూనిట్‌ను బట్టి 30 నుంచి 50 శాతం వరకు సబ్సిడీ లభించేది. దాంతో ఆయా రంగాల్లో అనుభవమున్న వారు టిఫిన్ సెంటర్ నుంచి టీ దుకాణం వరకు, ఆటో నుంచి ఇన్నోవా కార్ల వరకు, ఇంట్లో చీరల వ్యాపారం నుంచి వస్త్ర దుకాణం వరకు పెట్టుకుని ఆర్థికంగా ఎదిగారు. తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కార్పొరేషన్లను నిర్వీర్యం చేసింది.టీడీపీ హయాంలో ఇచ్చిన రుణాలను రికవరీ చేసి ప్రతి నెలా జీతాలను తీసుకునే పరిస్థితికి తీసుకొచ్చింది. కార్పొరేషన్లకు నిధులు కేటాయించక పోవడంతో కార్పొరేషన్ల అధికారులు ఐదేళ్లపాటు ఖాళీగా కూర్చోవాల్సి వచ్చింది.

్జ. బీసీల్లో 2020 యూనిట్లకు ఏకంగా 18,168 దరఖాస్తులు
. వైశ్యులకు 16 యూనిట్లకు గాను 1,764 దరఖాస్తులు
చిత్తూరు అర్బన్, మార్చి 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన సబ్సిడీ రుణాలకు తీవ్ర పోటీ నెలకొంది. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లుగా పేద, నిరుద్యోగ యువతను గాలికొదిలేయడంతో ఎప్పుడూ లేనంతగా వివిధ కులాల లబ్ధిదారులు పెద్దఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్న 2014 - 19 సంవత్సరాల మధ్య ఎస్సీ, ఎస్టీ, బీసీ, కమ్మ, కాపు, తదితర కులాల కార్పొరేషన్లకు పెద్దఎత్తున సబ్సిడీ రుణాలను మంజూరు చేసింది.ఏటా అన్ని కార్పొరేషన్లకు కలిపి 25వేల మందికి రుణాలను మంజూరు చేసేది. ఒక్కో లబ్ధిదారుడికి యూనిట్‌ను బట్టి 30 నుంచి 50 శాతం వరకు సబ్సిడీ లభించేది. దాంతో ఆయా రంగాల్లో అనుభవమున్న వారు టిఫిన్ సెంటర్ నుంచి టీ దుకాణం వరకు, ఆటో నుంచి ఇన్నోవా కార్ల వరకు, ఇంట్లో చీరల వ్యాపారం నుంచి వస్త్ర దుకాణం వరకు పెట్టుకుని ఆర్థికంగా ఎదిగారు. తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కార్పొరేషన్లను నిర్వీర్యం చేసింది.టీడీపీ హయాంలో ఇచ్చిన రుణాలను రికవరీ చేసి ప్రతి నెలా జీతాలను తీసుకునే పరిస్థితికి తీసుకొచ్చింది. కార్పొరేషన్లకు నిధులు కేటాయించక పోవడంతో కార్పొరేషన్ల అధికారులు ఐదేళ్లపాటు ఖాళీగా కూర్చోవాల్సి వచ్చింది.
ఫ ఈసారి వెల్లువెత్తిన దరఖాస్తులు
వైసీపీ పాలనలో పూర్తిగా నష్టపోయిన వర్గాలను ఆదుకోవాలని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం బీసీలు, ఈబీసీలు, కాపు, కమ్మ, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాలను ప్రాధాన్యతగా తీసుకుంది. దీంతో సబ్సిడీ రుణాల కోసం ఎప్పుడూ లేనంత సంఖ్యలో లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తాయి. 2,020 యూనిట్లను బీసీలకు కేటాయించగా 18,168 మంది దరఖాస్తు చేసుకున్నారు. వైఽశ్యులకు 16 యూనిట్లను కేటాయించగా 1,764 మంది, కమ్మ కులస్థులకు 84 యూనిట్లను కేటాయించగా 440 మంది, ఈబీసీ కులస్థులకు 103 యూనిట్లను కేటాయించగా 384 మంది, రెడ్డి కులస్థులకు 75 యూనిట్లను కేటాయించగా 363 మంది దరఖాస్తు చేసుకున్నారు.కాపులకు 445 యూనిట్లను కేటాయించగా 120 మందే దరఖాస్తు చేసుకోవడం విశేషం.
అధికారులకు, బ్యాంకర్లకు పరీక్షే
ఎన్నడూ లేనివిధంగా సబ్సిడీ రుణాల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు రావడంతో ఎంపిక విషయంలో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మామూలుగా అయితే పేదవారుగా ఉండి.. బ్యాంకుల్లో ఎంతో కొంత ఆర్థిక లావాదేవీలు జరిపిన వారికి అవకాశం ఇస్తారు. ఇంటర్వ్యూలో ఓ లబ్ధిదారుడికి రుణమివ్వాలని అధికారి నిర్ణయించినా బ్యాంకు అధికారులు ఫైనల్ చేయాల్సి ఉంది. సబ్సిడీ పోనూ మిగిలిన మొత్తాల్ని వాయిదాల పద్ధతిలో క్రమం తప్పకుండా చెల్లిస్తాడా లేదా అని బ్యాంకు అధికారులు అంచనా వేస్తారు. కార్పొరేషన్ అధికారులు చెప్పిన వారికి రుణాలిస్తే... బ్యాంకులకు కట్టాల్సిన డబ్బులను ఎవరు కడతారన్నది వారి ప్రశ్న. దానికితోడు జిల్లా అంతటా ఇంటర్వ్యూలు జరిగిన రోజుల్లో ఆయా మండల, నియోజకవర్గాల నేతలు వారికి కావాల్సిన వారి పేర్లను ఎంపీడీవోలకు, కమిషనర్లకు సిఫార్సు చేశారు. అలా చేయని ప్రజా ప్రతినిధులు కూడా వారికి కావాల్సిన లబ్ధిదారుల పేర్లను జాబితాల రూపంలో అధికారులకు ఇస్తున్నారు. సబ్సిడీ రుణాల మంజూరులో ప్రజా ప్రతినిధుల మాట చెల్లుతుందా లేదా కార్పొరేషన్ అధికారులు, బ్యాంకర్ల మాటలు చెల్లుతుందా చూడాల్సివుంది.