Share News

4న చిత్ర కళా వీధి ప్రదర్శన

ABN , Publish Date - Mar 31 , 2025 | 01:02 AM

ఆంధ్రప్రదేశ్‌ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 4న రాజ మహేంద్రవరంలో అమరావతి చిత్రకళా వీధి ప్రదర్శన నిర్వహించనున్నారు.

4న చిత్ర కళా వీధి ప్రదర్శన
ఇటువంటి చిత్రాలే ప్రదర్శన

రాజమహేంద్రవరం,మార్చి 30 (ఆం ధ్రజ్యోతి) : ఆంధ్రప్రదేశ్‌ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 4న రాజ మహేంద్రవరంలో అమరావతి చిత్రకళా వీధి ప్రదర్శన నిర్వహించనున్నారు. ఇది ఉభయ తెలుగు రాష్ర్టాల్లోనే తొలి ప్రద ర్శన. ఇటువంటి వీధి ప్రదర్శన బెంగ ళూరులో చాలాకాలంగా జరుగుతుంది. రాజమహేంద్రవరంలోని దామెర్ల రామా రావు ఆర్ట్‌ గ్యాలరీని అభివృద్ధి చేసి మ రింత ప్రాచుర్యంలోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.దీనిలో భాగం గా రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సృజనాత్మ క,సాంస్కృతిక సమితి చైర్‌పర్సన్‌ పొడ పాటి తేజస్వి ఆధ్వర్యంలో అమరావతి చిత్రకళా వీధి ప్రదర్శన ఏర్పాటు చేస్తు న్నారు. రాజమహేంద్రవరంలో ఏప్రిల్‌ 4న ఉదయం 9 నుంచి సాయం త్రం 5 గంటల వరకూ ఆర్ట్స్‌ కాలేజీ నుంచి జీజీ హెచ్‌ వరకూ సుమారు కిలో మీటరు మేర రోడ్డుకిరు వైపులా స్టాల్స్‌ ఏర్పాటు చేసి ప్రదర్శించనున్నారు. ఈ మేరకు మంగళవారం నుంచి ఏర్పాట్లు చేస్తారు. ఈ ప్రదర్శనకు సుమారు 500 చిత్ర, శిల్ప, హస్తకళాకారులు హాజరు కా ను న్నారు.వీధి ప్రదర్శనలో వివిధ కళాకా రుల చిత్రాలను విక్రయిస్తారు. వీటి ద్వా రా వచ్చే ఆదాయాన్ని దామెర్ల రామా రావు ఆర్ట్‌ గ్యాలరీ అభివృద్ధికి వినియో గించనున్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, డిప్యూటీ స్పీకర్‌ కనుమూరి రఘురామ కృష్ణం రా జు, మంత్రి దుర్గేష్‌ హాజరవుతారు.

Updated Date - Mar 31 , 2025 | 01:02 AM