భారీ దోపిడీకి స్కెచ్.. పోలీసుల చెక్!
ABN , Publish Date - Mar 20 , 2025 | 12:21 AM
సర్పవరం జంక్షన్, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): అతడో బ్యాంకు ఉద్యోగి. ఆన్‌లైన్ బెట్టింగ్, ఇతర చెడు వ్యసనాల కారణంగా పని చేసే బ్యాంకులో బంగారు ఆభరణాలు చోరీ చేసి నిందితుడిగా మారాడు. అప్పులు తీర్చేందుకు వేరేదారి లేక కష్టపడకుండా సులువుగా డబ్బులు సంపాదించేందుకు చోరీల బాటను ఎంచు

కాకినాడ జిల్లాలో తప్పిన భారీ దోపిడీ
పోలీసుల చాకచక్యంతో నిందితుడి పట్టివేత
2 పిస్టల్స్, 17 బుల్లెట్లు స్వాధీనం
నిందితుడు అంతర్‌జిల్లా పాత నేరస్తుడు
కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్
సర్పవరం జంక్షన్, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): అతడో బ్యాంకు ఉద్యోగి. ఆన్‌లైన్ బెట్టింగ్, ఇతర చెడు వ్యసనాల కారణంగా పని చేసే బ్యాంకులో బంగారు ఆభరణాలు చోరీ చేసి నిందితుడిగా మారాడు. అప్పులు తీర్చేందుకు వేరేదారి లేక కష్టపడకుండా సులువుగా డబ్బులు సంపాదించేందుకు చోరీల బాటను ఎంచుకున్నాడు. చిన్నచిన్న చోరీలు చేస్తే ప్రయోజనం లేదని ఏదైనా బ్యాంకు, ఏటీఎంలో చోరీకి పాల్పడి పెద్ద మొ త్తంలో దోపిడీ చేస్తే జీవితంలో సెటిల్ అయిపోవచ్చనే దురుద్దేశంతో బీహార్ నుంచి 2 పిస్టల్స్ కొనుగోలు చేశాడు. చోరీకి రెక్కీలు నిర్వహిస్తోండగా మంగళవారం రాత్రి కాజులూరులో రెక్కీ నిర్వహిస్తోండగా కాకినాడ జిల్లా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి చాకచక్యంగా నిందితుడ్ని పట్టుకున్నారు. 2 పిస్టల్స్, 17 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి అరెస్ట్ వివరాలను బుధవారం సర్పవరం జంక్షన్‌లో గల కాకినాడ రూరల్ సర్కిల్ కార్యాలయంలో సీఐ డీఎస్ చైతన్యకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
విశాఖపట్టణం మద్దిలపాలెం ఫిష్‌మార్కెట్ సమీపంలో గ్రూప్‌హౌస్‌లో చిటికెల నాగేశ్వరరావు, భార్య కుటుంబ సభ్యులతో కలసి నివాసం ఉంటున్నాడు. అతడు గతంలో పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు చైతన్య గోదావరి గ్రామీణ బ్యా ంకులో ప్రొబిషనరీ ఆఫీసర్‌గా పనిచేసేవాడు. ఈక్రమంలో ఆన్‌లైన్ బెట్టింగ్, చెడు వ్యవసనాల కారణంగా బ్యాంకు నుంచి 900 గ్రాముల బం గారాన్ని బ్యాంకు నుంచి తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేసి సొంత అవసరాలకు వాడుకోవడంతో సస్పెండ్ చేశారు. ఈ సందర్భంగా సుమారు రూ.40 లక్షలు బ్యాంకుకి కట్టేశాడు. అప్పులు తీర్చలేక, చెడు వ్యసనాలకు డబ్బుల్లేక చోరీల బాట పట్టాడు. చిన్న చోరీలతో జీవితంలో స్థిరపడటం సాధ్యం కాదని గ్రహించిన నాగేశ్వరరావు భారీ దోపిడీకి స్కెచ్ వేశాడు. బీహార్ ముంగర్ ప్రాంతానికి వెళ్లి 2పిస్టల్స్, 17 బుల్లెట్లు కొనుగోలు చేశాడు. దాంతో బ్యాంకు, ఏటీఎంల దోపీడి చేసేందుకు విశాఖ సిటీ, రూరల్, నర్సీపట్నం, ఆంధ్ర, తమిళనాడు బోర్డర్‌లలో రెక్కీ నిర్వ హించాడు. ఈ క్రమంలో నేరస్తుడు కాజులూరులో రెక్కీ నిర్వహిస్తున్నాడన్న పక్కా సమాచారంతో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బుధవారం కాకినాడ జిల్లా పోలీసులు చాకచక్యంగా వ్యవహ రించి నిందితుడ్ని పట్టుకుని, అతడి వద్ద నుంచి 2 పిస్టల్స్, 17 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. నిందితుడు అరెస్ట్‌తో భారీ దోపిడీని పోలీసులు నియంత్రించడం జరిగిందన్నారు. నిందితుడిపై నర్సీపట్నంలో 3 కేసులు, అన్నవరం, నక్కపలి,్ల తాడేపల్లిగూడెం, ఏలేశ్వరం పీఎస్‌లో తలో ఓ కేసు వెరసి మొత్తంగా ఒక చైన్ స్నాచింగ్, 4 రా త్రి, పగలు చోరీలు, ఓ బైక్ చోరీ కేసులు ఉన్న ట్టు తెలిపారు. నిందితుడ్ని చాకచక్యంగా పట్టుకోవడంలో కీలకంగా పనిచేసిన కాకినాడ రూరల్ సర్కిల్ పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో ఏఎ స్పీ మనీష్ దేవరాజ్ పాటిల్, ఎస్‌ఐలు ఎంవీవీ రవీంద్రబాబు,ఎం.మోహన్‌కుమార్ పాల్గొన్నారు.