Share News

మద్యం మత్తులో లారీ డ్రైవర్‌ వీరంగం

ABN , Publish Date - Mar 20 , 2025 | 12:24 AM

కరప, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా కరప మండలం వేళంగిలో బుధవారం మధ్యాహ్నం మద్యం మత్తులో ఒక లారీ డ్రైవర్‌ వీరంగం సృష్టించాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. రామచంద్రపురం నుం చి కాకినాడ వైపు వెళ్తున్న లారీ వేళంగి వచ్చేసరికి అదుపు తప్పింది. స్థానిక నిత్యానందపురం సెంటర్‌ మలుపు తిరిగాక రోడ్డు పక్కన నిల్చున్న ఒక మహిళను, ఆగి ఉన్న ఆటోను, బజ్జీల బండిని లారీ డ్రైవర్‌ ఢీకొట్టి

మద్యం మత్తులో లారీ డ్రైవర్‌ వీరంగం
మద్యం మత్తులో ఉన్న లారీ డ్రైవర్‌ను కిందకు లాగి దేహశుద్ధి చేస్తున్న స్థానికులు

రోడ్డుపక్క నిల్చున్న మహిళను,

ఆగి ఉన్న ఆటోను లారీతో ఢీ

దేహశుద్ధి చేసి పోలీసులకు

అప్పగించిన స్థానికులు

కరప, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా కరప మండలం వేళంగిలో బుధవారం మధ్యాహ్నం మద్యం మత్తులో ఒక లారీ డ్రైవర్‌ వీరంగం సృష్టించాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. రామచంద్రపురం నుం చి కాకినాడ వైపు వెళ్తున్న లారీ వేళంగి వచ్చేసరికి అదుపు తప్పింది. స్థానిక నిత్యానందపురం సెంటర్‌ మలుపు తిరిగాక రోడ్డు పక్కన నిల్చున్న ఒక మహిళను, ఆగి ఉన్న ఆటోను, బజ్జీల బండిని లారీ డ్రైవర్‌ ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయే ప్రయత్నం చేశా డు. స్థానికులు వెంటపడి పట్టుకోగా డ్రైవర్‌ పూటుగా మద్యం తాగి మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన పలువురు స్థానికులు డ్రైవర్‌ను కిందకు లాగి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పజెప్పారు. లారీ డ్రైవర్‌ను రామచంద్రపురానికి చెందిన రామకృష్ణరాజుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో కాజులూరు మండలం కుయ్యేరు గ్రామానికి చెందిన బండి బేబి గాయపడగా, ఆటో, బజ్జీల బండి ధ్వంసమయ్యాయి. క్షతగాత్రురాలికి వేళంగి పీహెచ్‌సీలో ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎస్‌ఐ తోట సునీత కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Mar 20 , 2025 | 12:24 AM