‘సూర్యఘర్’తో విద్యుత్‌బిల్లుల ఆదా
ABN , Publish Date - Mar 20 , 2025 | 12:57 AM
ఇంటి పైకప్పుపై సౌరఫలకాలను ఏర్పాటుచేసుకోవడం ద్వారా విద్యుత్‌బిల్లులను తగ్గించుకునేందుకు ప్రధాన మంత్రి సూర్యఘర్ యోజన పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని ఏపీఈపీడీసీఎల్ రాజమహేంద్రవరం రూరల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దాట్ల శ్రీధర్‌వర్మ అన్నారు. ఈ మేరకు బుధవారం నిర్వహించిన అవగాహన ర్యాలీని ఎస్‌ఈ తిలక్‌కుమార్ జెండా ఊపి ప్రారంభించారు.

ట్రాన్స్‌కో ఈఈ శ్రీధర్‌వర్మ
దివాన్‌చెరువు, మార్చి19(ఆంధ్రజ్యోతి): ఇంటి పైకప్పుపై సౌరఫలకాలను ఏర్పాటుచేసుకోవడం ద్వారా విద్యుత్‌బిల్లులను తగ్గించుకునేందుకు ప్రధాన మంత్రి సూర్యఘర్ యోజన పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని ఏపీఈపీడీసీఎల్ రాజమహేంద్రవరం రూరల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దాట్ల శ్రీధర్‌వర్మ అన్నారు. ఈ మేరకు బుధవారం నిర్వహించిన అవగాహన ర్యాలీని ఎస్‌ఈ తిలక్‌కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం శ్రీధర్‌వర్మ మాట్లాడుతూ ఒక కిలో వాట్ సోలార్ రూఫ్ టాప్‌కు రూ.30 వేలు, రెండు కిలోవాట్లకు రూ.60 వేలు, మూడు కిలోవాట్లకు రూ.78 వేలు వరకూ రాయితీ ఇస్తారన్నారు. మిగులు విద్యుత్ ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చునని చెప్పారు. కాగా రైతులు పంట పొలాల్లో సౌరప్లాంట్ ఏర్పాటు చేసుకునేందుకు అమలు చేస్తున్న పీఎం కుసుమ్ పథకం కింద రాజానగరం మండలం కలవచర్లలో 2 మెగావాట్ల ప్లాంటు ఏర్పాటుకు టెండర్లు పిలిచామన్నారు. గృహవినియోగదారులు 50శాతం రాయితీతో తమ విద్యుత్ అదనపు లోడ్ ను క్రమబద్దీకరించుకునేందుకు అవకాశం కల్పించారన్నారు. కార్యక్రమంలో ఈఈ(టెక్నికల్) ఎం.రవికుమార్, డీఈఈ పి.సన్యాసిరావు, ఏఈఈ వీఎన్ సుధాకర్,దివాన్‌చెరువు శ్రీలక్ష్మీగణపతి ఆటోయూనియన్ అధ్యక్షుడు దేశాల శ్రీనివాసరావు, సామాజిక కార్యకర్త సూరారపు డేవిడ్‌రాజు పాల్గొన్నారు.