తమిళనాడు తరహాలో ద్వారపూడిలో కావిళ్ల ఉత్సవం
ABN , Publish Date - Mar 20 , 2025 | 12:20 AM
మండపేట, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపే ట మండలం ద్వారపూడిలో బుధవారం కుమారస్వామివారి కావిళ్ల, కలశ ఉత్సవాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. తమిళనాడు తరహాలో ఇక్కడ ప్రతి ఏటా ఉత్సవం నిర్వహించటం ఆనవాయితీ. దాదాపు 40 రోజు

కలశాలతో 500 మంది మహిళల ఊరేగింపు
మండపేట, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపే ట మండలం ద్వారపూడిలో బుధవారం కుమారస్వామివారి కావిళ్ల, కలశ ఉత్సవాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. తమిళనాడు తరహాలో ఇక్కడ ప్రతి ఏటా ఉత్సవం నిర్వహించటం ఆనవాయితీ. దాదాపు 40 రోజులపాటు కుమారస్వామి మాలధారణ దీక్షను ఇక్కడి ప్రజలు చేపడతారు. గ్రామంలో ఉన్న స్వామివారి ఆలయం వద్ద దీక్ష తీసుకున్న స్వాములు కఠోర దీక్షతో పూజలు చేస్తుంటారు. 500 మంది మహిళలు కలశాలతో బయలుదేరుతారు. ఈ క్రమంలో బుధవారం జరిగిన కార్యక్రమానికి ద్వారపూడి పరిసర గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చారు. అనంతరం గ్రామంలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో విశేషపూజలు, జలాభిషేకాలు నిర్వహించారు. స్వామిని టీడీపీ మండలాధ్య క్షుడు యరగతపు బాబ్జీ, బీజేపీ నేత కోనా సత్యనారాయణ, ప్రముఖులు దర్శించుకున్నారు.