పోలీసుల అదుపులో పిల్లి రాజు!
ABN , Publish Date - Mar 20 , 2025 | 12:22 AM
ద్రాక్షారామ, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం నెలపర్తిపాడు గణపతినగ రం వద్ద కన్నబిడ్డలను కా

యానాం జీఎంసీ బాలయోగి వారధిపై ద్విచక్రవాహనం గుర్తింపు
ద్రాక్షారామ, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం నెలపర్తిపాడు గణపతినగ రం వద్ద కన్నబిడ్డలను కాలువలోకి తోసి కుమార్తె కారుణ్య(7)మరణానికి కారకుడైన పిల్లి రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు స మాచారం. ఈనెల 17న రాయవరం మండలం వెంటూరు గ్రామానికి చెందిన ఫైనాన్స్ వ్యాపా రి పిల్లిరాజు తన కుమారుడు రామసందీప్, కుమార్తె కారుణ్యలను పాఠశాల నుంచి తీసుకువచ్చి గణపతి నగరం వద్ద ఇంజరం కాలువలోకీ తోసేశాడు. అనంతరం మోటారు సైకిల్‌పై పరారయ్యాడు. ఘటనలో కుమారుడు రామసందీప్ ప్రాణాలతో బయటపడగా కుమార్తె కారుణ్య (7) మృతిచెందింది. అప్పటి నుంచి రామచంద్రపురం సీఐ ఎం.వెంకటనారాయణ ఆద్వర్యంలో ఎస్‌ఐ ఎం.లక్ష్మణ్ సిబ్బంది బృందాలుగా పిల్లి రాజు ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. మంగళవారం పిల్లి రాజు ఆచూకీ ఎవరికైనా తెలిస్తే పోలీసులకు తెలియచేయాలని రా జు ఫోటో కూడా పోలీసులు విడుదల చేశారు. బుధవారం రాజు మోటారు సైకిల్‌ను యానాం జీఎంసీ బాలయోగి వారధిపై గుర్తించారు. దీంతో రాజు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడనే కోణంలో సీఐ ఎం.వెంకటనారాయణ, ఎస్‌ఐ ఎం.లక్ష్మణ్ పవర్‌బోట్లపై యానాం నుంచి సముద్ర తీర ప్రాంతం వరకు గాలింపు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. రాజు పోలీసులకు లొంగిపోయాడా లేదా అరెస్టు చేశారా అన్నది గురువారం తెలియనుంది. పిల్లి రాజు సజీవంగా పోలీసులకు చిక్కడంతో ఈ ఘాతుకం వెనుక పూర్వాపరాలు పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది.