ఆలీవ్ రిడ్లే.. గుడ్లు గుడ్లే..!
ABN , Publish Date - Mar 20 , 2025 | 12:35 AM
అంతరించేపోయే జాబితాలో చేరిన అరుదైన అలీవ్‌రిడ్లే తాబేళ్లు మన సముద్ర తీర ప్రాంతానికి ఓ ప్రవాహంలా తరలివస్తున్నాయి. ఎక్కడె క్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీలంక.. థాయ్‌లాండ్.. ఇండోనేషియా దేశాల నుంచి సముద్రంలో వేల కిలోమీటర్లు ఈదుకుంటూ ఇక్కడకు సంతానోత్పత్తి కోసం బారులు తీరుతు న్నాయి.. ఇప్పుడు కాకినాడ జిల్లాలోని హోప్ ఐలాండ్.. కోనసీమ జిల్లాలోని గోదావరి, సము ద్రం కలిసే ప్రాంతాల్లో వేలల్లో గుడ్లు పెడుతు న్నాయి.

సముద్ర తీరంలో విదేశాల నుంచి అలీవర్ రిడ్లే తాబేళ్ల ప్రవాహం
ఇప్పటివరకు కాకినాడ, కోనసీమ జిల్లాలకు 675 తాబేళ్లు రాక
జనవరి 18 నుంచి ఈ రెండు జిల్లాల్లో 74 వేల గుడ్లు పెట్టిన తాబేళ్లు
కాకినాడ హోప్‌ఐలాండ్‌లో 27 వేల గుడ్లు పెట్టిన 225 తాబేళ్లు
కోనసీమ జిల్లాలో 46 వేల గుడ్లు పొదిగిన 450 అలీవ్‌రిడ్లేలు
ఒక్కో తాబేలు 120 చొప్పున గుడ్లు పొదుగుతున్న వైనం
సముద్ర తీరాన గొయ్యి తీసి గుడ్లు పొదిగి ఇసుక కప్పేసి తిరిగి సముద్రంలోకి
మొదలైన గుడ్ల నుంచి తాబేలు పిల్లల జననం.. రోజుకు 650 పిల్లలు బయటకు
నక్కలు, కుక్కల బారి నుంచి రక్షించేందుకు అటవీ శాఖ హేచరీలు
గతేడాది ఉమ్మడి జిల్లాలో 1.20 లక్షల గుడ్లు పొదిగిన అలీవ్‌రిడ్లే తాబేళ్లు
(కాకినాడ- ఆంధ్రజ్యోతి)
అంతరించేపోయే జాబితాలో చేరిన అరుదైన అలీవ్‌రిడ్లే తాబేళ్లు మన సముద్ర తీర ప్రాంతానికి ఓ ప్రవాహంలా తరలివస్తున్నాయి. ఎక్కడె క్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీలంక.. థాయ్‌లాండ్.. ఇండోనేషియా దేశాల నుంచి సముద్రంలో వేల కిలోమీటర్లు ఈదుకుంటూ ఇక్కడకు సంతానోత్పత్తి కోసం బారులు తీరుతు న్నాయి.. ఇప్పుడు కాకినాడ జిల్లాలోని హోప్ ఐలాండ్.. కోనసీమ జిల్లాలోని గోదావరి, సము ద్రం కలిసే ప్రాంతాల్లో వేలల్లో గుడ్లు పెడుతు న్నాయి. సంతానోత్పత్తికోసం అంతదూరం నుం చి వస్తోన్న ఈ తాబేళ్లు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఇప్పటివరకు పెట్టిన గుడ్లు ఎన్నో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. ఒక్కో తాబేలు సరాసరి 120 గుడ్ల చొప్పున జనవరి మూడో వారం నుంచి ఇప్పటివరకు ఏకంగా 74 వేల గుడ్లు పొదిగాయి. గుడ్లు పొదిగేసి ఆ వెంటనే తిరిగి సముద్రంలోకి వెళ్లిపోగా.. ఇప్పుడు ఆ గుడ్ల నుంచి రిడ్లే పిల్లలు బయటకు రావడం మొదలుపెట్టాయి. ఎక్కడో వేల కిలోమీటర్లు ఈదుకుని ఇక్కడ కొచ్చి గుడ్లు పొదిగి పిల్లలను చూడకుండానే వెళ్లిపోతున్న తాబేళ్లు ఆ గుడ్లను రక్షించేందుకు ఏకంగా గోతులు తవ్వి అందులో గుడ్ల పొదిగి ఎవరికి కనిపించకుండా ఇసుక కప్పేసి వెళ్లిపోగా.. ఇప్పుడు వాటి నుంచి రోజుకు వందలాది పిల్లలు బయటకు వస్తున్నాయి. దీంతో ఇప్పుడు సముద్రతీరంలో ఇవన్నీ సందడి చేస్తూ కనువిందు చేస్తున్నాయి. అటు అటవీ శాఖ అధికారులు ఈ గుడ్ల నుంచి క్షేమంగా పిల్లలు బయటకు వచ్చేలా అనేక రక్షణ చర్యలు తీసుకుంటుండడంతో ఈ ఏడాది ఆలివ్‌రెడ్లే తాబేళ్ల సంతానం భారీస్థాయిలో పెరుగుతోంది.
సందడే సందడి..
సముద్ర పర్యావరణాన్ని రక్షించడంలో ఎంతో కీలకమైన ఆలివ్‌రిడ్లే తాబేళ్లు ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోయే జాబితాలో ఉన్నాయి. ఈ తాబేళ్లలో ఏడు రకాల జాతులుండగా, ఐదు జా తులు జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో అధికం. అటు శ్రీలంక, థాయ్‌లాండ్, ఇండోనేషి యా దేశాల్లోను అనేక జాతులున్నాయి. ఇప్పు డివి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సముద్ర తీరానికి వందల్లో ప్రయాణించుకుంటూ వస్తు న్నాయి. ప్రధానంగా కాకినాడ హోప్‌ఐలాండ్, కోనసీమ జిల్లాలో ఐ.పోలవరం, అల్లవరం, అమ లాపురం రూరల్ ప్రాంతాల్లోని సముద్ర తీరానికి తరలివస్తున్నాయి. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసి నా వీటి సందడే నెలకొంది. వీటి రాక జనవరి నెలాఖరు నుంచి మొదలవగా ప్రస్తుతం ఎక్కు వ సంఖ్యకు చేరుకుంది. ఇలా వచ్చిన తాబేళ్లన్నీ కాకినాడ, కోనసీమ జిల్లాల్లో భారీగా గుడ్లు పొ దుగుతున్నాయి. ఇప్పటివరకు అటవీశాఖ అధికా రుల అంచనా మేరకు కాకినాడ జిల్లాకు 225, కోనసీమ జిల్లాకు 450 తాబేళ్లు వచ్చినట్టు గుర్తిం చారు. ఇవి ఇప్పటివరకు మొత్తం 74 వేల గుడ్లు పొదిగాయి. ఇది భారీ సంఖ్యగానే భావించాలి. కాకినాడ జిల్లాలో హోప్‌ఐలాండ్‌కు ఇప్పటివరకు 225 తాబేళ్లు రాగా, 28వేల గుడ్లు పొదిగాయి. కోనసీమ జిల్లాలో 450 తాబేళ్లు 46వేల గుడ్లు పొదిగినట్టు గుర్తించారు. దీంతో ఈ రెండు జిల్లా ల తీర ప్రాంతాల్లో ఆలివ్‌రిడ్లే తాబేళ్ల సందడి భారీగా ఉంది. వాస్తవానికి ఈ గుడ్లను తాబేళ్లు సముద్రతీరాన ఇసుకలో 30 నుంచి 45 సెంటీ మీటర్ల లోతున కుండాకారంలో గుంతలు తీస్తా యి. వాటిలో గుడ్లను పొదుగుతాయి. ఒక్కో తా బేలు సరాసరి 120 వరకు గుడ్లను పొదుగు తా యి. ఆ వెంటనే గుడ్లపై ఇసుకను కప్పేసి తిరిగి తాబేళ్లు తమ గమ్యస్థానానికి వెళ్లిపోతాయి. ఆ తర్వాత 40 రోజుల ఆ తర్వాత ఆ గుడ్ల నుంచి తాబేళ్లు పొదుగుతాయు. ఈలోపు 30 నుంచి 32 డిగ్రీల ఉష్ట్రోగ్రత ఎండ వేడిమి ఉంటేనే గుడ్ల నుంచి పిల్లలు బయటకు వస్తాయి. ఇప్పుడు హోప్‌ఐలాండ్‌తోపాటు కోనసీమ జిల్లాలో వాసా లతిప్ప, ఎస్.యానాం, గచ్చకాయల పొర, నీళ్ల రేవు తదితర ప్రాంతాల్లో వేలల్లో ఉన్న గుడ్లను అటవీశాఖ సంరక్షిస్తోంది. తాబేళ్లు పెట్టే గుంత లను ఇన్సిటివ్‌గా పిలిచే అటవీశాఖ వాటి చుట్టూ ప్రస్తుతం నెట్‌లు కట్టి రక్షిస్తోంది. లేదంటే కుక్క లు, నక్కలు ఈ గుడ్లను తినేసే ప్రమాదం ఉంది. వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న గుడ్లను అటవీశాఖ కాకి నాడ జిల్లాలో రెండు, కోనసీమ జిల్లాలో ఐదుచోట్ల హేచరీల కింద ఒకేచోటకు తెచ్చి సంరక్షించడంతో దీంతో ఈ దఫా గుడ్ల సంరక్షణ మెరుగైంది.
పిల్లలు బయటకొస్తున్నాయి..
ఆలివ్‌రిడ్లే తాబేళ్లు ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో కాకినాడ, కోనసీమ జిల్లాలకు 675 వరకు రాగా, 90 శాతం తాబేళ్లు గుడ్లు పెట్టి వెళ్లిపోయాయి. ఇప్పుడు 40 రోజుల వ్యవధి దాటడంతో ఆదివారం నుంచి పిల్లలు పొదుగు తున్నాయి. రోజుకు ఉమ్మడి జిల్లాలో 780 వర కు పిల్లలు బయటకొస్తున్నాయి. ఇవి పుట్టిన 12గంటల్లో తిరిగి సముద్రంలోకి వెళ్లిపోతున్నా యి. వాస్తవానికి అరుదైన జాతికి చెందిన ఆలి వ్‌రిడ్లే తాబేళ్లలో ఆడా, మగా పుట్టుక పూర్తిగా ఉష్ణోగ్రతపైనే ఆధారపడనున్నాయి. గుడ్లు పొ దిగిన తర్వాత 28 నుంచి 32 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే 40 రోజుల తర్వాత మగ తాబేళ్లు, ఉష్ణో గ్రత 30 నుంచి 32 మధ్య ఉంటే ఆడ తాబేళ్లు బయటకు వస్తాయి. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడంతో ఆడతాబేళ్ల పిల్లలు అధి కంగా బయటకు వస్తున్నాయి. కాకినాడతో పో ల్చితే కోనసీమ జిల్లాలో పిల్లలు అధికంగా ఉత్పత్తి అవుతున్నాయని అటవీశాఖ అధికారు లు చెబుతున్నారు. మరోపక్క ఈనెలాఖరు వరకు రానున్న తాబేళ్లు మరికొన్ని గుడ్లను పొ దగనున్నాయి. ఈనెల దాటితే విదేశాల నుంచి ఆలివ్ రిడ్లే తాబేళ్ల రాక పూర్తిగా ఆగిపోనుంది.
ఇక్కడకే ఎందుకంటే..
ఆలివ్ రిడ్లే తాబేళ్లకు ఓ ప్రత్యేకత ఉంది. అవి ఎక్కడైతే గుడ్ల నుంచి పిల్లలుగా బయ టకు వచ్చాయో అదే ప్రాంతానికి పెద్ద య్యాక తిరిగి సంతానోత్పత్తికి వస్తాయి. ఇందులోభాగంగా కాకినాడ జిల్లాలో హోప్ ఐలాండ్, కోనసీమ జిల్లాలో కొన్ని తీరప్రాంత మండలాలకు తరలివస్తున్నాయి. గతంలో ఉప్పాడ తీరానికి సైతం భారీగా వచ్చేవి. అక్కడ సముద్రతీరం కలుషితం కావడంతో ఇక్కడకు రావడం లేదు. వాస్తవానికి ఏటా వేలల్లో వచ్చే ఆలివ్‌రిడ్లే తాబేళ్లు కొన్నేళ్లుగా భారీగా తగ్గిపోయాయి. సముద్ర కాలుష్యం, వేట పడవులకు తగిలి, వలలో చిక్కుకుని భారీగా చనిపోతున్నాయి. దీంతో రెండేళ్లుగా సముద్రతీరంలో ఎక్కడ చూసినా వీటి కళేబ రాలే కనిపిస్తున్నాయి. దీంతో అరుదైన జా తికి చెందిన వీటిని సంరక్షించాలని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ జిల్లా అటవీశాఖ అధికా రులను ఆదేశించారు. దీంతో తాబేళ్ల గుడ్లను ఇటీవల ఎక్కువగా సంరక్షిస్తున్నారు. సము ద్రంలో ఆక్సిజన్ శాతం పెంచేందుకు, చేపల సంతానం వృద్ధి చెందేందుకు ఆలివ్ రిడ్లే తాబేళ్లు ఎంతగానో దోహదం చేస్తాయి. చేప పిల్లలను తిని జీవించే జెల్లీఫిష్‌లను తాబేళ్లు తినడంవల్ల చేపల ఉత్పత్తి పెరుగుతుంది. కాగా గతేడాది ఉమ్మడి జిల్లాలో ఆలివ్‌రిడ్లే తాబేళ్లు లక్షకుపైగానే గుడ్లు పొదిగాయి. కాకి నాడ జిల్లాకు గతేడాది 420 తాబేళ్లు రాగా 32 వేల వరకు గుడ్లు పొదిగాయి. అంబేడ్క ర్ కోనసీమ జిల్లాలో గతేడాది 850 వరకు తాబేళ్లు రాగా 91 వేల గుడ్లు పొదిగాయి.