Share News

డీఎస్సీకి వేళాయె!

ABN , Publish Date - Apr 07 , 2025 | 12:17 AM

త్వరలోనే కొలువుల జాతర మొదలు కానుంది. ఈ వారంలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది.

డీఎస్సీకి వేళాయె!

విద్యాశాఖ సన్నాహాలు

ఉమ్మడి జిల్లాలో 1278 ఖాళీలు

నిరుద్యోగుల ఎదురుచూపులు

ఎస్సీ వర్గీకరణతో నిలుపుదల

రోస్టర్‌ పాయింట్లు వస్తే ప్రకటన

కాకినాడ రూరల్‌, ఏప్రిల్‌ 6(ఆంధ్రజ్యోతి) : త్వరలోనే కొలువుల జాతర మొదలు కానుంది. ఈ వారంలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది. ఎస్సీ వర్గీకరణ రోస్టర్‌ పాయింట్లు రాగానే నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. వర్గీకరణ ఆర్డినెన్స్‌కు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఇప్పటికే దీని కోసం కొన్ని లక్షల మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నా రు. ఎన్నికలకు ముందు టీడీపీ,జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి ఇచ్చిన ప్రధాన హామీల్లో ఇదొకటి. ప్రస్తుతం దీని అమలు దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది.

ఇప్పటికే టెట్‌ పూర్తి

గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని విస్మరించింది.అంతకుముందు ఎన్నికల హామీల్లో ఏటా జాబ్‌క్యాలెండర్‌ విడుదల చేస్తామని చెప్పి అధికారంలోకి రాగానే ఆ ఊసే మరిచింది. దీం తో నిరుద్యోగ అభ్యర్థులకు ఆ ఐదేళ్లూ ఎదురుచూపులే మిగిలాయి.2024లో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 16,347కుపైగా ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు చేసింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)ను నిర్వహించి ఇప్పటికే ఫలితాలు ప్రకటించింది. ఈ ఫలితాలు నవంబరులోనే విడుదల కావడంతో అదే నెలలో డీఎస్సీ నోటిఫికేషన్‌ వస్తుందని అభ్యర్థులంతా భావించారు. అప్పటికే చాలా మంది అభ్యర్థులు కోచింగ్‌ తీసుకుంటూ డీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. కొన్ని సాంకేతిక కారణాలు, ఎమ్మెల్సీ కోడ్‌ అమలుతో పాటు అభ్యర్థుల వయసు పెంపు తదితర సమస్యలపై స్పష్టమైన నిర్ణయం రావాల్సి ఉన్నందున నోటిఫికేషన్‌ ప్రకటన వాయిదా పడింది. ఆ సమస్యలన్నింటినీ సరిచేసి కోడ్‌ ము గిసిన తర్వాత నోటిఫికేషన్‌ వెలువరిస్తారని ఆశించారు.ప్రస్తుతం నిరుద్యోగులకు మంచి రో జులు వచ్చాయి. తాజాగా సీఎం చంద్రబాబు, విద్యాశాఖా మంత్రి లోకేశ్‌ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాల్లో ఏప్రిల్‌లోనే డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చి 16,347 ఉపాధ్యాయ ఉద్యో గాలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. ఆ ప్రక్రియ మొత్తం జూన్‌ కల్లా పూర్తి చేస్తామని తెలిపారు.ఈ నేపథ్యంలో విద్యాశాఖ ఆ దిశగా అడుగులు వేస్తుండడంతో అభ్యర్థులు ఉత్కం ఠగా ఎదురుచూస్తున్నారు.

వర్గీకరణ పాయింట్లు రాగానే..

ఎస్సీ వర్గీకరణ రోస్టర్‌ పాయింట్లు రాగానే నోటిఫికేషన్‌ విడుదల చేయడానికి విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.వర్గీకరణ ఆర్డినెన్స్‌కు ప్రభు త్వం చర్యలు వేగవంతం చేసింది. ఆర్డినెన్స్‌ జారీ కాగానే సాధారణ పరిపాలన శాఖ రిజర్వేషన్లపై కొత్త రోస్టర్‌ విడుదల చేస్తుంది. దానికి అనుగుణంగా పోస్టులు కేటాయించి, నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. రోస్టర్‌ పాయిం ట్లు విడుదలైన మరుసటి రోజు లేదా ఆ తర్వా త రోజు డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలవుతుం ది.వర్గీకరణ ప్రక్రియ దాదాపు పూర్తికావడంతో నోటిఫికేషన్‌కు మార్గం సుగమమైంది.

ఉమ్మడి జిల్లాలో ఖాళీలివే..

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా 1,278 ఉపాధ్యాయ ఉద్యోగాలను డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నట్టు సమాచారం. స్కూల్‌ అసి స్టెంట్లకు సంబంధించి ఆంగ్లం 90, తెలుగు 70, హిందీ 71, గణితం 55, ఫిజికల్‌ సైన్స్‌ 59, బయాలాజికల్‌ సైన్స్‌ 95, సోషల్‌ స్టడీస్‌ 114, సంస్కృతం 5,వ్యాయామ విద్య 199, ఎస్జీటీలు 349, పీజీటీ, టీజీటీ ప్రిన్సిపాల్స్‌ మొత్తం 171 ఖాళీలు డీఎస్సీ ద్వారా భర్తీ కానున్నట్టు తెలిసింది.మరో వారం రోజుల్లో డీఎస్సీ నోటిఫికేష న్‌ వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఉ మ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 95 వేల మం దికి పైగా అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు.

Updated Date - Apr 07 , 2025 | 12:17 AM