Share News

సీసీ..చూసీ!

ABN , Publish Date - Apr 07 , 2025 | 12:16 AM

గత నెల 24న జరిగిన పాస్టర్‌ పగడాల ప్రవీణ్‌ మృతి ఎన్నో సంచనాలకు వేదికైంది.. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది..ఆ ఘటనకు సీసీ కెమెరాలే దాదాపుగా చెక్‌ పెట్టాయి.

 సీసీ..చూసీ!

చూస్తున్నాయ్‌.. కనిపెట్టేస్తున్నాయ్‌

అయినా ఏర్పాటులో తీవ్ర నిర్లక్ష్యం

సర్కారుకు సీసీ కెమెరాలు కరువు

ఉమ్మడి జిల్లాలో సుమారు 1520

ఎక్కడికక్కడ పాడైపోతున్న వైనం

ప్రైవేటు సీసీ కెమెరాలపైనే ఆధారం

జాతీయ రహదారిలో దారుణం

జొన్నాడ టూ అన్నవరం 121

మరిన్ని ఏర్పాటుకు డిమాండ్‌

(రాజమహేంద్రవరం/అమలాపురం/ కాకినాడ/క్రైం-ఆంధ్రజ్యోతి)

గత నెల 24న జరిగిన పాస్టర్‌ పగడాల ప్రవీణ్‌ మృతి ఎన్నో సంచనాలకు వేదికైంది.. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది..ఆ ఘటనకు సీసీ కెమెరాలే దాదాపుగా చెక్‌ పెట్టాయి.ఆయన అదే రోజు హైద రాబా ద్‌ నుంచి బుల్లెట్‌పై సుమారు 400 కిలోమీటర్లు పైనే ప్రయాణించారు. ఆ ఘటనపై క్రైస్తవులంతా ఏకమయ్యారు. పాస్టర్‌ను హత్య చేశారంటూ గొంతెత్తారు.. ఎవరికి వారు రకరకాల వాదనలు వినిపించారు. పోలీసులు దర్యాప్తు ఆరంభించారు.. సీసీ అస్త్రం బయటకు తీశారు.. ఆయన ప్రయాణించిన దారిలో సుమారు 300 సీసీ కెమెరాలు పరిశీలించారు.. ఏం జరిగిందో చెప్పడానికి ప్రయత్నించారు. అల్లర్లను చల్లార్చారు. అసలు సీసీ కెమెరాలే లేకపోతే దర్యాప్తు ఇప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడని పరిస్థితి ఉండేది. నిఘా నేత్రాల వల్ల ఆ కేసులో దాదాపుగా చిక్కుముళ్లు వీడినట్టు సమాచారం. ఇంతటి ప్రాధాన్యం ఉన్న సీసీ కెమెరాల ఏర్పాటులో ఇటు యంత్రాంగం, అటు జనంలోనూ అలసత్వం కనబడుతోంది. సర్కారు వారి కెమెరాలను రకరకాల దోషాలు పట్టిపీడిస్తుంటే.. ప్రజలు వాటిని ఏర్పాటు చేసుకోవడంపై విముఖత చూపుతున్నారు.

సవాలక్ష సమస్యల పరిష్కారంలో కీలక భూమిక వహిస్తున్నది ’నిఘా’ నేత్రమే. నేరాల దర్యాప్తు, నియంత్రణలో మూడో కన్ను అత్యంత కీలకంగా మారింది.అధిక దర్యాప్తులు సీసీ కెమె రాల ఆధారంగానే ఓ కొలిక్కి వస్తున్నాయి. పలు కీలకమైన కేసుల్లో సీసీ కెమెరాల పుటేజీలు లభ్యత వల్ల ఏళ్ల పాటు సాగాల్సిన దర్యాప్తులు వేగంగా జరిగి నేరస్తులను జైలుకు పంపిస్తు న్నాయి. నేర నియంత్రణలో సీసీ కెమెరా పుటే జీలు కీలకంగా ఉన్నా ఏర్పాటులో కరువు కనబ డుతోంది.తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన రాజమహేంద్రవరంలో కనీసం 5 వేల కుపైనే సీసీ కెమెరాలు ఉండాలి. మరో రెండేళ్లలో పుష్క రాలు రానున్నాయి.కానీ ప్రస్తుతం 375 కెమె రాలు ఉండగా..కేవలం 185 పనిచేస్తున్నాయి. అధికారికంగా 480 కెమెరాలు ఉన్నాయని లెక్క చెబుతున్నారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 150 సీసీ కెమెరాలు ఉన్నా యి. వీటిలో 15 కెమెరాలు సాంకేతిక ఇబ్బందుల వల్ల పనిచేయడం లేదు. మునిసిపల్‌ కార్పొ రేషన్‌ కార్యాలయంలో ఉన్న కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో 10 మంది సిబ్బంది షిఫ్టుల వారీగా పనిచేస్తూ ఈ కెమెరాల ఫుటేజీని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. నగరంలో ప్రస్తుతం 320 సర్కారు కెమెరాలు మాత్రమే విధుల్లో ఉన్నాయి. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పరిధిలోని పోలీసు యంత్రాంగం ఎన్నో కీలకమైన కేసులను చేధించింది. కోనసీమ జిల్లా పరిధిలో పోలీసుల రికార్డుల ప్రకారం 2వేలకు పైనే సీసీ కెమెరాలు ఉన్నాయి. కాకినాడ జిల్లా వ్యాప్తంగా 3,622 సీసీ, పిటిజెడ్‌ కెమెరాలు ఉన్నాయి. జిల్లా పోలీస్‌శాఖకు సంబంధించి 540 సీసీ, సిటిజెడ్‌ కెమెరాలుండగా పోలీస్‌శాఖ 16 డ్రోన్‌ కెమెరాలను ఏర్పాటు చేసింది. ఈ కెమెరాలు నిరంతచాయం పని చేస్తూ అసాం ఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 10 వేల సీసీ కెమెరాలు ఏర్పా టు చేస్తే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు తావు లేకుండా జిల్లాలో ప్రశాంతమైన వాతావరణాన్ని రూపొందించ వచ్చని ఎస్పీ బింధుమాధవ్‌ ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా సంఘటన జరిగిన సమ యంలో ప్రైవేటు కెమెరాలపై ఆధారపడాల్సి వస్తోంది.శివారు, సమ స్యాత్మక ప్రాంతాల్లో నిఘానేత్రాలు మసక బారిపోయాయి.

హై..వే పట్టదా!

జాతీయ రహదారిపై సీసీ కెమెరాలపై తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది. జాతీయ రహదారిపై కిలో మీటరుకు ఒకటి చొప్పున జొన్నాడ నుంచి రాజ మహేంద్రవరం వరకూ 49, దివాన్‌ చెరువు నుంచి-అన్నవరం వరకూ 72 కెమెరాలు ఉన్నా యి. వీటి పర్యవేక్షణ సేఫ్‌వే సంస్థ చూస్తోంది. అయితే హైవే మరమ్మతులు, జొన్నాడ దగ్గర జరుగుతున్న ఫ్లైఓవర్‌ వంటి పనులు చేస్తున్న ప్పుడు వైర్లు తెగిపోవడంతో రోజుల తరబడి సమస్య వస్తోంది. జొన్నాడ వద్ద నిర్మిస్తున్న బ్రిడ్జి పనుల వల్ల సుమారు 40 కెమెరాలు పని చేయడం లేదు. ఇలాంటి పరిస్థితి వల్ల ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రాథమికంగా నిజ నిర్ధారణ అత్యంత కష్టంగా మారుతోంది.

కాకినాడలో సీసీసీ నిరుపయోగం..

కార్పొరేషన్‌(కాకినాడ), ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): స్మార్ట్‌ సిటీ నిఘా నేత్రానికి విఘాతం కలిగింది.కాకినాడ స్మార్ట్‌ సిటీగా ఎంపికైన తర్వాత మొదటిగా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌(సీసీసీ)ను తలపెట్టింది. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ప్రాజెక్టు 2017లో స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ నిధు లు రూ.90 కోట్లతో చేపట్టారు. కార్పొరేషన్‌ పరిధిలో మొత్తం 71 ప్రాంతాల్లో 350 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దీని నిర్వహణ బాధ్యతలను సెర్టిలైట్‌ సంస్థకు 2019లో అప్పగించారు. నెలకు రూ.50 లక్షల చొప్పున ఏడాదికి రూ.ఆరు కోట్లు చొప్పున ఐదేళ్ల పాటు రూ.30 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నారు. మూడేళ్లుగా సంస్థ కు చెల్లించాల్సిన రూ.19.50 కోట్ల బిల్లుల బకాయిలు స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌ చెల్లించలేదు. నిర్వహణ భారంగా మారడంతో నిర్వాహకులు అగ్రి మెంట్‌ మధ్యలోనే బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈ సెంటర్‌లో 35 మంది పనిచేసేవారు. సుమారు రూ.90 కోట్లతో నిర్మించిన కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నిరుపయోగంగా మారింది. కార్పొరేషన్‌ అధికారులు కమాండ్‌ కంట్రోల్‌ సెం టర్‌ పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.

పోలీస్‌ కెమెరాలకు మ్యాట్రిక్స్‌

పోలీస్‌ సీసీ కెమెరాలను మ్యాట్రిక్స్‌ సంస్థకు అప్పగించారు. కెమెరాల ఏర్పాటు, పర్యవేక్షణ, మరమ్మతులు ఆ సంస్థ చూడాల్సి ఉంది. కానీ ఆ సంస్థ అలసత్వం వల్ల కెమెరాల పని తీరు రోజు రోజుకూ మందగిస్తోందని చెబు తున్నారు. మ్యాట్రిక్స్‌ సంస్థకు విజయవాడలో సర్వర్‌ ఉంది. సీసీ పుటేజీ 3 రోజుల వరకూ జిల్లా పోలీసు కార్యాలయంలో నిక్షిప్తమై ఉం టుంది.తర్వాత 28 రోజుల వరకూ మ్యాట్రిక్స్‌ వద్ద ఉంటుంది.మూడు రోజుల తర్వాత ఏదై నా పుటేజీ అవసరమైతే కెమెరా ఐపీతో లెటర్‌ రాసి మ్యాట్రిక్స్‌ వద్ద నుంచి తీసుకోవాలి. 28 రోజులు దాటితే సీసీ పుటేజీ ఉండదు.

హైవేపై.. సేఫ్‌ వేనా..

జాతీయ రహదారిపై ఎన్‌హెచ్‌ఏఐ పరిధి లోని సీసీ కెమెరాల పుటేజీ సేఫ్‌వే సంస్థ వద్ద 30 రోజుల వరకూ ఉంటుంది. ఆ గడువు ముగిస్తే పుటేజీ దొరకదు. ఏదైనా ప్రమాద ఘటనలు ఉంటే ఆ పుటేజీని జాగ్రత్త పరు స్తున్నామని చెబుతున్నారు.ఎంతో ప్రాధాన్యత ఉన్న సీసీ కెమెరా పుటేజీలకు ప్రభుత్వం ఎందుకు సర్వర్లు ఏర్పాటు చేయడం లేదనేది ప్రశ్నగానే మిగులుతోంది.

సీసీలు చూశాయ్‌..పట్టించాయ్‌..

ఫ రాజమహేంద్రవరంలో వరుస చైన్‌ స్నాచింగ్‌లతో హడలెత్తించిన దొంగోడి ఆటకు సీసీ కెమెరాలు చెక్‌ పెట్టాయి. రెండేళ్ల కిందట బొమ్మూరులోని ఇంట్లో నిద్రిస్తున్న ఓ వృద్ధురాలిపై యువకుడు అత్యా చారం చేశాడు.ఈ కేసులో సీసీ కెమెరాలే నేరస్తుడిని కటకటాల్లోకి నెట్టాయి.

ఫ అమలాపురం కిమ్స్‌ ఆసుపత్రిలో జరిగిన భారీ దోపిడీ కేసును సీఐ డి.ప్రశాంత్‌కుమార్‌ ఆధ్వర్యంలో పోలీసులు సెల్‌ఫోన్‌ టెక్నాలజీ, సీసీ కెమెరాల ద్వారా గుర్తించి భారీ ఎత్తున రికవరీ చేశారనడానికి ఒక ఉదాహరణగా చెప్పవచ్చు.

ఫ 2022 నవంబర్‌లో కాకినాడ జిల్లా తునిలో టీడీపీ నాయ కుడు, మాజీ ఎంపీపీ పోల్నా టి శేషగిరిరావుపై కత్తితో దాడి చేసి బైక్‌పై ఉడాయించిన నిందితుడిని ఇంటి వద్ద ఉ న్న సీసీ పుటేజీ ఆధారంగా పట్టుకున్నారు..

ఫ గత వైసీపీ ప్రభుత్వంలో దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యాన్ని చంపి ఎమ్మెల్సీ అనంతబాబు డోర్‌ డెలివరీ చేసిన కేసులోనూ సీసీ కెమెరాలే కీలకంగా మారాయి. ఆ హత్యకు ముందు ఆ దళిత యువకుడిని అనంతబాబు ఎలా తీసుకువెళ్లాడో సీసీ కెమెరాల్లో రికార్డ్‌ అయ్యాయి. వాటి ఆధా రంగా కేసు వెలుగులోకి వచ్చింది.ఇలా ఒకటేమిటి నేరాలకు సంబంధించిన ఏ కేసులోనైనా సీసీ కెమెరాలే కీలకంగా మారాయి.

Updated Date - Apr 07 , 2025 | 12:16 AM