Share News

ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ 20శాతం కూడా అందలేదు

ABN , Publish Date - Apr 07 , 2025 | 12:27 AM

పోలవరం నిర్వాసితులకు 20శాతం కూడా ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీలు చెల్లించలేదని పోల వరం నిర్వాసితుల కాంగ్రెస్‌ పార్టీ అధ్యాయన కమిటీ చైర్మన్‌ మార్టిన్‌ లూధర్‌ అన్నారు. రాజమహేంద్రవరంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయ న మాట్లాడారు. రాష్ట్రానికే జీవనాడిగా ఉన్న ప్రా జెక్టుకు జీవం పోయాల్సిన పాలకులు జీవాన్ని తీసేస్తున్నారన్నారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తే 78వేల కుటుంబాల నిర్వాసితులు నష్టపోతారన్నారు.

ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ 20శాతం కూడా అందలేదు
సమావేశంలో మాట్లాడుతున్న మార్టిన్‌ లూథర్‌

  • పోలవరం నిర్వాసితుల కాంగ్రెస్‌ పార్టీ అఽధ్యయన కమిటీ చైర్మన్‌ మార్టిన్‌ లూథర్‌

రాజమహేంద్రవరం సిటీ, ఏప్రిల్‌ 6( ఆంధ్ర జ్యోతి): పోలవరం నిర్వాసితులకు 20శాతం కూడా ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీలు చెల్లించలేదని పోల వరం నిర్వాసితుల కాంగ్రెస్‌ పార్టీ అధ్యాయన కమిటీ చైర్మన్‌ మార్టిన్‌ లూధర్‌ అన్నారు. రాజమహేంద్రవరంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయ న మాట్లాడారు. రాష్ట్రానికే జీవనాడిగా ఉన్న ప్రా జెక్టుకు జీవం పోయాల్సిన పాలకులు జీవాన్ని తీసేస్తున్నారన్నారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తే 78వేల కుటుంబాల నిర్వాసితులు నష్టపోతారన్నారు. ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్ల నుంచి 41.15కి తగ్గించడం వల్ల 194 టీఎంసీల నీ టి నిల్వ సామర్ధ్యం నుంచి 114 టీ ఎంసీలకు పరిమితం చేసి ప్రాజెక్టు స్వరూపాన్ని పూర్తిగా మార్చేశార న్నారు. పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర జీవనాడిగా ఉండేలా కేంద్రం వేగంగా చర్యలు తీసుకునేలా రాష్ట్రంలోని ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. ప్రాజెక్టును అతి త్వరలో తమ కమిటీ పరిశీలన చేస్తుందన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ద్వారా 22లక్షల ఎకరాల పాత ఆయకట్టు స్థిరీకరణకు, 8లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించే లక్ష్యం కలిగిన మహానేత వైఎస్‌ఆర్‌ ఆశయానికి తూట్లు పడుతున్నాయన్నారు. గతంలో చంద్రబాబు, జగన్‌ చేసిన పొరపాట్ల వల్ల ప్రాజెక్టు ఎగువ కాపర్‌ డ్యాం, డయాఫ్రంవాల్‌ కొట్టుకుపోయాయని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.30 వేల కోట్ల ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ సరిపోతుందన్నారు. త్వర లో ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జలశక్తి మంత్రిని కలిసి సమస్యలను పూర్తిగా వివరిస్తామన్నారు. సమావేశంలో నాయకులు డాక్టర్‌ వడయార్‌, అబ్దుల్లా షరీఫ్‌, డాక్టర్‌ వడయార్‌ శ్రీనివాస్‌, మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు ఎం. శారద, నిడదవోలు కోఆర్డినేటర్‌ కారంగి వెంకటేశ్వరరావు, మహ్మద్‌ ఫసల్‌ బేగ్‌, తాడాల కొండరాజు, మేడవరపు బలగం దొర పాల్గొన్నారు.

Updated Date - Apr 07 , 2025 | 12:27 AM