Share News

MLC Results: ఉభయ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పేరాబత్తుల రాజశేఖరం విజయం

ABN , Publish Date - Mar 04 , 2025 | 12:45 PM

MLC Results: ఉభయగోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా టీడీపీ కూటమి పేరాబత్తుల రాజశేఖరం విజయం సాధించారు. పీడీఎఫ్ అభ్యర్థి వీర రాఘవులుపై పేరాబత్తుల గెలుపొందారు.

MLC Results: ఉభయ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పేరాబత్తుల రాజశేఖరం విజయం
Parabathula Rajasekharam Wins

ఏలూరు, మార్చి 4: ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు (Graduate MLC Results) వచ్చేశాయి. ఉభయగోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా టీడీపీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం (Perabathula Rajasekhar) ఘన విజయం సాధించారు. పీడీఎఫ్ అభ్యర్థి వీర రాఘవులుపై 77వేల 461 ఓట్ల ఆధిక్యతతో పేరాబత్తుల గెలుపొందారు. మొత్తం 2,18,997 ఓట్లు పోలవగా.. రాజశేఖరంకు లక్షా 24 వేల 702 ఓట్లు రాగా.. రాఘవులకు 47వేల 241 ఓట్లు వచ్చాయి. చెల్లిన ఓట్లు 199 208 రాగా.. చెల్లని ఓట్లు 19789 వచ్చాయి.


కాగా.. ఈరోజు మధ్యాహ్నం ఏడు రౌండ్లు పూర్తయ్యే సరికే రాజశేఖరం ఆధిక్యంలో నిలిచారు. విజయానికి కావాల్సిన పోలైన ఓట్లలో 50 శాతం మొదటి ప్రాధాన్యత ఓట్లను కూటమి అభ్యర్థి సాధించారు. మ్యాజిక్ ఫిగర్ దాటడంతో పేరాబత్తుల రాజశేఖరం విజయం ఖాయమైంది. మరో రౌండ్ లెక్కింపు ఉండగానే పేరబత్తుల విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. ఏడు రౌండ్లు పూర్తి అయ్యే సరికి.. రాజశేఖరం మొత్తం లక్షా 12వేల 331 ఓట్లు సాధించారు. అలాగే పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీరరాఘవులుకు 41,268 ఓట్లు వచ్చాయి. ఈ క్రమంలో వీర రాఘవులుపై పేరాబత్తుల రాజశేఖరం 71,063 ఓట్ల ఆధిక్యతలో నిలిచారు. మొత్తం ఎనిమిది రౌండ్లలో కౌంటింగ్ ముగిసింది. మొత్తం మీది రాఘవులుపై 77వేల 461 ఓట్ల ఆధిక్యతతో పేరాబత్తుల రాజశేఖరం విజయ దుందుబి మోగించారు. పేరాబత్తుల గెలుపుతో టీడీపీ కూటమి నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.


ఇవి కూడా చదవండి...

Gold Rates Today: పసిడి కొనుగోలు చేయాలా.. నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే..

Ukraine Military aid Paused: ఉక్రెయిన్ అధ్యక్షుడికి భారీ షాకిచ్చిన ట్రంప్.. మిలిటరీ సాయం నిలిపివేత

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 04 , 2025 | 03:00 PM