Share News

పోలవరం..పరుగు

ABN , Publish Date - Apr 09 , 2025 | 12:44 AM

ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతమయ్యాయి. డయాఫ్రంవాల్‌ నిర్మా ణానికి సన్నాహ పనులు చురుగ్గా సాగుతు న్నాయి.

పోలవరం..పరుగు

ఇప్పటి వరకూ 55.9 శాతం

ఒక పక్క డయాఫ్రం వాల్‌

మరో పక్క ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌

2027 డిసెంబర్‌కి ప్రాజెక్టు

రెండేళ్లలో పూర్తిచేయడం లక్ష్యం

సీఎం చంద్రబాబు రాకతో వేగం

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతమయ్యాయి. డయాఫ్రంవాల్‌ నిర్మా ణానికి సన్నాహ పనులు చురుగ్గా సాగుతు న్నాయి. ఈ ఏడాది జనవరి 18న డయాఫ్రం వాల్‌ పనులు ఆరంభించారు. మొత్తం 1396.6 మీటర్ల మేర ఈ వాల్‌ను నిర్మించాల్సి ఉంది. ఇప్పటి వరకూ 158.2 మీటర్ల మేర నిర్మిం చారు.ఇంకా సుమారు 1238 మీటర్ల వాల్‌ నిర్మించాల్సి ఉంది.ఈ ఏడాది డిసెంబర్‌ 31వ తేదీకి దీనిని పూర్తి చేసి 2026 జనవరి1కి ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడానికి నిర్ణయించుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. డయా ఫ్రం వాల్‌ మీదనే అసలు డ్యామ్‌ అయిన ఎర్త్‌కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) నిర్మించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో డయాఫ్రంవాల్‌ నిర్మాణం పూర్త య్యే వరకూ వేచి ఉండకుండా దానికి సమాం తరంగా ఇరువైపులా ఎర్త్‌కమ్‌ రాక్‌ఫిల్‌ నిర్మాణ పనులు చేయడానికి నిర్ణయించారు. ఈసీ ఆర్‌ఎఫ్‌ గ్యాప్‌-1ను పూర్తి చేసే పనిలో అధికా రులు, యంత్రాలు నిమగ్నమయ్యాయి. సీఎం నారా చంద్రబాబునాయుడు ఇటీవల స్వయం గా ప్రాజెక్టు పరిశీలించి అధికారులకు సూచ నలు చేయడంతో పనులు వేగవంతం అయ్యా యి.2027 డిసెంబర్‌ నాటికి ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని ప్రభుత్వం చెబుతోంది.

పనులు జరిగిన తీరిది..

ఇప్పటి వరకూ పోలవరం ప్రాజెక్టుకు సం బంధించి మొత్తం పనులు 55.90 శాతం జరిగాయి.సివిల్‌ వర్కు 78.56 శాతం, హెడ్‌ వర్కు పనులు 76.43 శాతం,కుడి ప్రధాన కాలువ (ఆర్‌ఎంసి) పనులు 92.75 శాతం, ఎడమ ప్రధాన కాలువ(ఎల్‌ఎంసి) పనులు 74.43 శాతం, భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌ ప నులు 25.11 శాతం జరిగాయి.వైసీపీలో చతి కిలపడిన ప్రాజెక్టును కొత్త ప్రభుత్వం గాడి లో పెట్టింది.2024 జూన్‌ నుంచి ఇప్పటి వర కూ సుమారు 7 శాతం పనులు జరిగాయి.

ఇదీ యాక్షన్‌ ప్లాన్‌

పోలవరం ప్రాజెక్టు హెడ్‌వర్క్స్‌కు సంబం ధించి అధికారులు స్పష్టమైన ప్రణాళికతో ఉన్నారు. ఈసీఆర్‌ఎఫ్‌ గ్యాప్‌ -1 పనులు 2024 డిసెంబర్‌ 10న ప్రారంభించారు.2026 మార్చి 31కి పూర్తి చేసే లక్ష్యంతో పనిచేస్తున్నారు. డయాఫ్రంవాల్‌ పనులు ఈ ఏడాది జనవరి 18న ఆరంభించారు.ఈ ఏడాది డిసెంబర్‌ 31కి పూర్తి చేసే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఈసీఆర్‌ ఎఫ్‌ గ్యాప్‌-2 పనులు ఇంకా మొదలుకాలేదు. ఇవి త్వరలో మొదలు పెట్టి 2027 డిసెంబర్‌ 27కి పూర్తి చేసే లక్ష్యంతో ఉన్నారు.ఇవి పూర్త యితే ప్రాజెక్టు పూర్తయినట్టే. కుడి వైపు అను బంధ పనులు వచ్చే ఏడాది జూలై 31కి పూర్తి చేయడంతో పాటు ఎడమ వైపు అనుబంధ పనులు 2027 ఫిబ్రవరి 28కి పూర్తి చేసే లక్ష్యంతో ఉన్నారు.ఇక భూసేకరణ, ఆర్‌ అండ్‌ ఆర్‌, కాలనీల నిర్మాణం, కుటుంబాల తరలింపు పనులపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. మరో పక్క పవర్‌ ప్రాజెక్టు పనులు వేగంగా జరుగు తున్నాయి.స్పిల్‌వే పూర్తి కావడంతో ఇప్పటికే గోదావరి నీటిని స్పిల్‌వే గుండా ధవళేశ్వరం బ్యారేజీ వైపు వదిలేస్తున్న సంగతి తెలిసిందే.

Updated Date - Apr 09 , 2025 | 12:44 AM