Share News

కబళించిన కారు!

ABN , Publish Date - Apr 01 , 2025 | 12:33 AM

రాజానగరం, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): కారు రూపంలో వచ్చిన మృత్యువు ఇద్దరిని కబలించి రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం పోలీస్‌స్టేష న్‌ పరిధిలోని కొంతమూరులో సోమవారం తెల్లవారు జామున జరిగిన ఈ సంఘటనకు సంబంఽధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొంతమూరు లోని కళ్యాణ్‌నగర్‌కు చెందిన ఒంటెద్దు వెంకటేష్‌ (29) బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తు న్నాడు. ఉగాది

కబళించిన కారు!
సంఘటనా స్థలంలో బైక్‌

బైక్‌ను ఢీకొనడంతో ఇద్దరు మృతి

కొంతమూరులో ఘటన

రాజానగరం, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): కారు రూపంలో వచ్చిన మృత్యువు ఇద్దరిని కబలించి రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం పోలీస్‌స్టేష న్‌ పరిధిలోని కొంతమూరులో సోమవారం తెల్లవారు జామున జరిగిన ఈ సంఘటనకు సంబంఽధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొంతమూరు లోని కళ్యాణ్‌నగర్‌కు చెందిన ఒంటెద్దు వెంకటేష్‌ (29) బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తు న్నాడు. ఉగాది సందర్భంగా స్వగ్రామం వచ్చాడు. రాజమహేంద్రవరంలోని స్నేహితులను కలిసేందుకు వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చేం దుకు మోరంపూడికి చెందిన ర్యాపిడో బైకిస్టు ఈర్లు నాగబాబు(43)ను ఆశ్రయించాడు. ర్యాపిడో బైక్‌పై ఇద్దరు కొంతమూ రుకు వస్తుండగా మార్గ మధ్యంలో మనీషా ఫంక్షన్‌ హాల్‌ సమీపంలో రాత్రి 2 గంటల సమయంలో వెనుక వైపు నుంచి వేగంగా వస్తున్న కారు వీరు ప్రయాణిస్తున్న మోటార్‌సైకిల్‌ను బలంగా ఢీకొంది. ప్రమాదానికి కారణమైన కారులో ఉన్న యువకులు మద్యం మత్తులో ఉన్నట్టుగా తెలిసింది. దీంతో మద్యం మత్తు ఆ రెండు కుటుంబాలను తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఈ ప్రమాదంలో వెంకటేష్‌ను కారు దాదాపు కిలోమీటర్‌ మేర ఈడ్చుకుంటూ వెళ్లింది. వెంకటేష్‌ తలకు బలమైన గాయాలు కావ డంతో అక్కడికక్కడే మరణించాడు. నాగబాబుకు కూడా బలమైన గాయాలయ్యాయి. సంఘటనా స్థల ంలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో చికిత్స కోసం రాజమహేంద్రవరం తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరిం చారని రాజానగరం పోలీసులు తెలిపారు. ప్రమాదా నికి కారణమైన కారు ఆగకుండా వెళ్లిందని, మృతుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. మృతదేహాలను పోస్టుమా ర్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించామన్నారు. ఈ మేరకు రాజానగరం ఎస్‌ఐ మనోహర్‌ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Apr 01 , 2025 | 12:33 AM