Share News

అవ్వకు స్వర్ణ కిరీటం

ABN , Publish Date - Apr 02 , 2025 | 11:53 PM

ఆదోని పట్టణ ప్రజలు తమ ఇంటి ఇలవేల్పుగా భావించే మహాయోగి లక్ష్మమ్మ అవ్వకు అలంకరించేందుకు ఆలయ నిర్వాహకులు 1.3 కిలోల బరువైన బంగారు కిరీటాన్ని తయారు చేయించారు.

అవ్వకు స్వర్ణ కిరీటం
లక్ష్మమ్మ అవ్వ కోసం తయారు చేయించిన బంగారు కిరీటం

ఆదోని టౌన, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): ఆదోని పట్టణ ప్రజలు తమ ఇంటి ఇలవేల్పుగా భావించే మహాయోగి లక్ష్మమ్మ అవ్వకు అలంకరించేందుకు ఆలయ నిర్వాహకులు 1.3 కిలోల బరువైన బంగారు కిరీటాన్ని తయారు చేయించారు. రూ.కోటి ఖర్చుతో ఈ విగ్రహాన్ని తయారు చేయించినట్లు ఆలయ చైర్మన రాచోటి రామయ్య బుధవారం వెల్లడించారు. కిరీటాన్ని అందంగా తయారు చేయడంలో సహకరించిన జీఆర్‌టీ జ్యూవెల్లర్స్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ స్వర్ణ కిరీటాన్ని 93వ రథోత్సవం రోజున అవ్వకు అలంకరించనున్నట్టు వెల్లడించారు.

Updated Date - Apr 02 , 2025 | 11:53 PM