Share News

దేశ హితంకోసం ఆవిర్భవించిందే బీజేపీ

ABN , Publish Date - Apr 06 , 2025 | 11:46 PM

దేశ హితం కోసం ఆవిర్భవించిన పార్టీ బీజేపీ అని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్‌గౌడ్‌ అన్నారు. ఆదివారం భువనగిరిలో జరిగిన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో ఆయన పార్టీ జెండాను ఎగురవేసి సీనియర్‌ నాయకులను సత్కరించి మాట్లాడారు.

దేశ హితంకోసం ఆవిర్భవించిందే బీజేపీ

పార్టీ జిల్లా అధ్యక్షుడు అశోక్‌గౌడ్‌

భువనగిరి టౌన్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): దేశ హితం కోసం ఆవిర్భవించిన పార్టీ బీజేపీ అని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్‌గౌడ్‌ అన్నారు. ఆదివారం భువనగిరిలో జరిగిన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో ఆయన పార్టీ జెండాను ఎగురవేసి సీనియర్‌ నాయకులను సత్కరించి మాట్లాడారు. రెండు సీట్లతో ప్రారంభమైన పార్టీ ప్రస్థానం నేడు వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారంలో కొనసాగే స్థాయికి ఎదిగిందన్నారు. నాటి వాజ్‌పేయి, నేటి ప్రధాని మోదీ జనరంజక, దేశ సమగ్రత పాలన సాగిస్తున్నారన్నారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌, 370 ఆర్టికల్‌ రద్దు, అయోధ్య రామాలయ నిర్మాణం, వక్ఫ్‌ సవరణ చట్టం తదితర మహత్తర నిర్ణయాలతో ప్రధాని మోదీ దేశాన్ని అగ్రరాజ్యం స్థానం లక్ష్యంగా నడిపిస్తున్నారన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్లు నర్ల నర్సింగ్‌రావు, మాయ దశరథ, బీజేపీ పట్టణ అధ్యక్షుడు రత్నపురం బలరాం, నాయకులు సుర్వి శ్రీనివా్‌సగౌడ్‌, జెన్నపల్లి శ్యాంసుందర్‌రెడ్డి, చందా మహేందర్‌గుప్తా, వైజయంతి, పి.బలరాం, కోళ్ల భిక్షపతి, పట్నం కపిల్‌, ఎండీ మహ్మద్‌, ఉడత భాస్కర్‌, ఆర్‌.కృష్ణచారి, మంగు నరసింహారావు, క్రాంతి, ఉషాకిరణ్‌, మల్లిఖార్జున్‌, నాగరాజు, సంతు, నర్సింగ్‌రావు పాల్గొన్నారు.

Updated Date - Apr 06 , 2025 | 11:46 PM