Share News

IAS Cadre Dispute: ఏపీలో ఉండాల్సిందే

ABN , Publish Date - Apr 05 , 2025 | 03:06 AM

ఐఏఎస్‌ అధికారిణి వాణీ ప్రసాద్‌ తనను తెలంగాణ కేడర్‌కు పంపాలన్న పిటిషన్‌ను క్యాట్‌ తిరస్కరించింది. ఆమె తండ్రి ఏపీకి చెందినవారని, స్థానికత ఆధారంగా ఏపీలోనే విధులు నిర్వహించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.

IAS Cadre Dispute: ఏపీలో ఉండాల్సిందే

వాణీ ప్రసాద్‌కు క్యాట్‌లో చుక్కెదురు

స్థానికత ఆంరఽధ... కాబట్టి ఆ రాష్ట్ర కేడర్‌లోనే ఉండాలి

అమరావతి, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): తెలంగాణ నుంచి ఏపీ కేడర్‌కు వచ్చిన ఐఏఎస్‌ అధికారిణి వాణీప్రసాద్‌కు మరోసారి క్యాట్‌లో చుక్కెదురయింది. తనను తెలంగాణ కేడర్‌కు పంపాలంటూ ఆమె మరోసారి దాఖలు చేసిన పిటిషన్‌ను ట్రైబ్యునల్‌ కొట్టేసింది. ఆమె స్థానికత ఆధారంగా ఏపీలోనే పనిచేయాలని స్పష్టం చేసింది. వాణీ ప్రసాద్‌ రెండోసారి దాఖలు చేసిన పిటిషన్‌లో... ‘నేను చిన్నతనం నుంచి తెలంగాణలోనే పెరిగాను. అక్కడే చదువుకున్నా. కాబట్టి నన్ను తెలంగాణ కేడర్‌కు కేటాయించండి’ అని విజ్ఞప్తి చేశారు. ఆమె పిటిషన్‌ను పరిశీలించిన ట్రైబ్యునల్‌... ‘రాష్ట్ర విభజన అనంతరం, ఆ తర్వాత వివిధ కమిటీలు, డీవోపీటీ జారీ చేసిన ఉత్తర్వులను పాటించాలి. మీ తండ్రి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి. కాబట్టి మీ స్థానికత ఏపీనే. అందుకనే మీరు అక్కడే విధులు నిర్వహించాలి. పీయూష్‌ సిన్హా కమిటీ, ఖండేకర్‌ కమిటీ రికమండేషన్‌ను పాటించాలి’ అని పేర్కొంది.


ఇవి కూడా చదవండి

Borugadda Anil: రాజమండ్రి నుంచి అనంతపురానికి బోరుగడ్డ.. ఎందుకంటే

Kasireddy shock AP High Court: లిక్కర్ స్కాంలో కసిరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 05 , 2025 | 03:07 AM