గ్రామాల్లో వెల్లివిరిసిన ఆధ్యాత్మికత
ABN , Publish Date - Apr 07 , 2025 | 11:32 PM
జిల్లాలో పలు గ్రామాల్లో సోమవారం ఆధ్యాత్మికత వెల్లివిరిసింది.

పోలాకి, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పలు గ్రామాల్లో సోమవారం ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. శ్రీరామ నవమి ఉత్సవాల్లో భాగంగా సీతా రాముల కల్యాణం, పట్టాభిషేక మహోత్సవాలు నిర్వ హించారు. పోలాకి, చెల్లాయివలస, బెలమర గ్రామాల్లోని రామాలయాల్లో శ్రీరాముని కల్యాణం సోమవారం భక్తిశ్రద్ధ లతో నిర్వహించారు. పోలాకి రామాలయంలో పురోహితుడు దార్లపూడి నాగేశ్వర శర్మ ఆధ్వర్యంలో అంబేడ్కర్ కమిటీ నాయకుడు చిన్నప్పన్న దంపతులు కల్యాణం నిర్వహించారు. దీర్గాశిలో ఐదురోజుల పాటు శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు కమిటీ సభ్యులు తెలిపారు.
నందిగాంలో..
నందిగాం, ఏప్రిల్ 7(ఆంధ్ర జ్యోతి): నంది గాంలో సీతారాముల కల్యాణం సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక కల్యాణ మండపంలో లమ్మత మధుబాబు ఆధ్వర్యంలో పురోహితులు రేజేటి బోసుబాబు, ఎం. రమేష్‌శర్మ పర్యవేక్షణలో విశేష పూజలు చేసి కల్యా ణాన్ని వైభవంగా చేశారు. భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు.
వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం
పలాస, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డులోని సీతా రామాలయంలో శ్రీరామ నవమి ఉత్స వాల్లో భాగంగా సోమవారం శ్రీరామ పట్టాభిషేకం వైభ వంగా నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విశేష పూజలు, పట్టాభిషేకం, పూర్ణాహుతి తదితర కార్యక్రమాలు చేపట్టారు. సీతారాముల విగ్రహాలకు సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభి షేకం చేశారు. భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. సాయంత్రం సీతారాముల విగ్రహాలను పల్లకిలో వేంచేపు చేసి తిరువీధి ఉత్సవం చేపట్టారు.
అల్లాడలో శుభరాట..
జలుమూరు, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): అల్లాడ గ్రామంలో వెలసిన శ్రీలక్ష్మీనారాయణస్వామి ఆలయంలో స్వామి వారి కల్యాణానికి సోమవారం పందిరిరాట వేశారు. గ్రామ పురోహితుడు ఈవీ ఎన్‌మూర్తి ఆధ్వ ర్యంలో హనుమంతు రంగనాఽథం మాస్టారు దంపతులు ప్రత్యేక పూజలు చేసి శుభరాట వేశారు. బుధవారం శ్రీలక్ష్మీనారాయణస్వామి కల్యాణం నిర్వహి స్తున్నట్లు వారు తెలిపారు. భక్తులు పాల్గొనాలని కోరారు.
శ్రీరామ మందిరాల్లో..
జలుమూరు, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పలు గ్రామాల రామమందిరాల్లో సోమవారం శ్రీరామ పట్టాభిషేకం భక్తిశ్రద్ధలతో నిర్వ హించారు. హరికృష్ణమ్మపేట, ఊడిగలపాడు గ్రామాల్లోని శ్రీరామ మందిరాల్లో ఈ కార్యక్రమం చేపట్టారు. హరికృష్ణమ్మపేటలో వేదపండితుడు అక్కాజోస్యుల రమేష్ శర్మ నేతృత్వంలో గ్రామ పురోహితుడు రాజశేఖరశర్మ శ్రీరామ పట్టాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. 108 సుగంధ ద్రవ్య జలా లతో సీతారాముల విగ్రహాలకు అభిషేకం చేశారు. కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
ముగిసిన వసంతోత్సవాలు
పాతపట్నం, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): స్థానిక షిర్డీగిపై షిర్డీసాయినాథ ధ్యాన మందిరంలో నిర్వహిస్తున్న వసంతోత్సవాలు ముగిశాయి. ఉగాది నుంచి ప్రతిరోజూ వివిధ కార్యక్రమాలతో పాటు విద్యార్థులకు భక్తి పాట లు, వక్తత్వం, వ్యాసరచన, చిత్రలేఖనం, ముగ్గుల పోటీలను నిర్వహించి విజేతలకు సోమవారం బహుమతులు అందించారు. కార్యక్రమంలో ధ్యాన మందిరం ప్రతినిధులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.