8 నుంచి ఐఆర్‌సీటీసీ సప్త జ్యోతిర్లింగ దర్శనయాత్ర
ABN , Publish Date - Mar 27 , 2025 | 01:11 AM
ఇండియన్ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ సౌత్ సెంట్రల్ జోన్ ఆధ్వర్యంలో ఏ ప్రిల్ 8 నుంచి 19 వరకు 11 రాత్రులు, 12 రో జుల పాటు సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర సా గుతుంది. ఏప్రిల్ 8న విజయవాడలో బయలుదేరుతుంది.

వన్‌టౌన్, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): ఇండియన్ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ సౌత్ సెంట్రల్ జోన్ ఆధ్వర్యంలో ఏ ప్రిల్ 8 నుంచి 19 వరకు 11 రాత్రులు, 12 రో జుల పాటు సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర సా గుతుంది. ఏప్రిల్ 8న విజయవాడలో బయలుదేరుతుంది. మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, నాగేశ్వర్, సోమనాథ్, భీమశంకర్, త్రయంబకేశ్వర్, ఘుష్ణేశ్వర్‌కు విజయవాడ, ఖమ్మం, ఖాజీపేట, సికింద్రాబాద్ మీదుగా రైలు వెళుతుంది. స్లీపర్ ఎకానమీలో పెద్దలకు రూ.20,890, స్టాండర్డ్ త్రీ ఏసీలో రూ.33,735, కంఫర్ట్ టూ ఏసీలో రూ. 44,375 అవుతుంది. 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు ఎకానమీలో రూ.19,555, స్టాండర్డ్ త్రీ ఏసీలో రూ.32,160, కంఫర్ట్ టూ ఏసీలో రూ.42,485 చొప్పున చార్జీలు చెల్లించాలని ఐఆర్‌సీటీసీ విజయవాడ ఏరియా మేనేజర్ ఎం.రాజా బుధవా రం ఒక ప్రకటనలో తెలిపారు. బుకింగ్ కోసం 9281495848, 9281030714 నెంబర్లకు ఫోన్ చేయవచ్చునని, విజయవాడ రైల్వేస్టేషన్‌లోని రిటైనింగ్ రూమ్ వద్ద ఉన్న ఐఆర్‌సీటీసీ కార్యాయలయంలో సంప్రదించవచ్చన్నారు. దీంతోపాటుగా ఆన్‌లైన్ బుకింగ్, మరిన్ని వివరాలకు వె బ్‌సైట్‌ను సందర్శించవచ్చునన్నారు. బడ్జెట్ హోటళ్లలో రాత్రిపూట బస ఉంటుందని చె ప్పారు. నాన్ ఏసీ వెహికల్, ఎకానమీ స్టాండర్డ్ ప్రయాణికులకు, ఏసీ వెహికల్ కంఫర్ట్ ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందన్నారు. ఉదయం టీ, అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం శాఖాహారం మాత్రమే అందించబడుతుందన్నారు. ప్రయాణ బీమా, ఎస్కార్ట్ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఐఆర్‌సీటీసీ టూర్ మేనేజర్లు ప్రయాణంలో మొత్త అందుబాటులో ఉంటారన్నారుఉ. దీనికి సంబంధించి పన్నులు వర్తిసాయని తెలిపారు.