TDP: టీడీపీ మాస్టర్ ప్లాన్ .. ఇక వైసీపీ పని అయిపోయినట్లే..
ABN , Publish Date - Mar 20 , 2025 | 04:55 PM
పార్టీ పుట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు అన్ని కష్టనష్టాల్లో తోడుగా ఉన్న కార్యకర్తలకు అండగా ఉండాలని అధినేత చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భావించారు. ఇందు కోసం గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ఏర్పడ్డ పార్టీ తెలుగు దేశం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ కార్యకర్తలు లేని గ్రామం లేదని అనటంలో అతిశయోక్తి లేదు. అలాంటి టీడీపీకి కార్యకర్తలే బలం. పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి ఇప్పటి వరకు ప్రతీ కష్టంలోనూ కార్యకర్తలు తోడుగా నిలుస్తూ వస్తున్నారు. అలాంటి కార్యకర్తలకు అండగా నిలవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంకల్పించిన సంగతి తెలిసిందే. కార్యకర్తే అధినేత అన్న మాటను ఆచరణలో పెట్టడానికి కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. వారి బాగోగులు అడిగి తెలుసుకుని, సమస్యలు ఉంటే పరిష్కరించే దిశగా ముందుకు వెళుతున్నారు.
మాట అన్నారు.. నిలబెట్టుకుంటున్నారు..
తెలుగు దేశం పార్టీ కోటి సభ్యత్వాలతో అతి పెద్ద కుటుంబంగా మారిన సందర్భంలో కార్యకర్తే అధినేతని మంత్రి నారా లోకేష్ అన్నారు. తర్వాతి కాలంలో అన్న మాటను నిలబెట్టుకుంటూ వారికి అండగా నిలవడానికి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏ నియోజకవర్గ పర్యటనకు వెళ్లినా కార్యకర్తలతో భేటీ అవుతున్నారు. బాబు ష్యూరిటీ- భవిష్యత్‌కు గ్యారెంటీ, పార్టీ సభ్యత్వం, ఓటర్ వెరిఫికేషన్, మన టీడీపీ యాప్‌లో ఉత్తమ పనితీరు కనబరిచిన కార్యకర్తలు, నాయకులతో సమావేశమవుతున్నారు. వారితో ఎక్కువ సమయం గడుపుతున్నారు. పార్టీలో కొత్తగా క్లస్టర్, యూనిట్, బూత్ విధానాన్ని తీసుకువచ్చారు. సీనియర్లను, జూనియర్లను సమానంగా గౌరవిస్తానని, పని చేసే వారిని ప్రోత్సహిస్తానని లోకేష్ వ్యాఖ్యానించారు. కార్యకర్తల సమస్యలు తెలుసుకుని అండగా నిలబడాలని నాయకులను ఆదేశించారు.
వైసీపీలా తప్పులు చేయకుండా..
గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు లక్షల మంది పార్టీ కార్యకర్తలను వాలంటీర్లుగా మార్చి.. వారి జీవితాలను నిర్వీర్యం చేసింది. ప్రజల కంటే.. పార్టీ అభివృద్ధిపై ఎక్కువ దృష్టి పెట్టి, సరైన పాలన అందించలేకపోయింది. వైసీపీ చేసిన తప్పుల్ని దృష్టిలో పెట్టుకుని తెలుగు దేశం పార్టీ ముందుకు సాగుతోంది. ఓ వైపు ప్రజా సంక్షేమంపై దృష్టి పెడుతూనే.. మరో వైపు కార్యకర్తల కోసం పని చేస్తోంది. పార్టీని, ప్రభుత్వాన్ని అనుసంధానం చేస్తూ ముందుకు వెళుతోంది. పార్టీకి బలమైన కార్యకర్తల సమస్యల పరిష్కారం కోసం ప్రతీ నిత్యం కృషి చేస్తోంది.
Also Read:
పోలీసుల విచారణకు విష్ణుప్రియ... మొబైల్ సీజ్
అందుకేమరి.. కాస్త చూసుకొని మాట్లాడాలనేది.. ఏం
For More Andhra Pradesh News and Telugu News..