Share News

మధ్యంతర భృతి, కరువు భత్యం ప్రకటించాలి

ABN , Publish Date - Mar 28 , 2025 | 12:01 AM

ఉద్యోగ, ఉపాధ్యాయులకు కరువు భత్యంతో పాటు కనీసం ఒక డీఏని విడుదల చేసి పీఆర్సీ కమిషనను నియమించి నివేదిక వచ్చేలోగా మధ్యంతర భృతిని ప్రకటించాలని నోబెల్‌ టీచర్స్‌ అసోసియేషన రాష్ట్ర అధ్యక్షుడు కొండూరు శ్రీనివాసరాజు కోరారు.

మధ్యంతర భృతి, కరువు భత్యం ప్రకటించాలి
ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డికి వినతిపత్రం అందజేస్తున్న ఎనటీఏ నాయకులు

రాయచోటిటౌన, మార్చి27 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగ, ఉపాధ్యాయులకు కరువు భత్యంతో పాటు కనీసం ఒక డీఏని విడుదల చేసి పీఆర్సీ కమిషనను నియమించి నివేదిక వచ్చేలోగా మధ్యంతర భృతిని ప్రకటించాలని నోబెల్‌ టీచర్స్‌ అసోసియేషన రాష్ట్ర అధ్యక్షుడు కొండూరు శ్రీనివాసరాజు కోరారు. గురువారం ఆ యన పులివెందులలోని ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల శాసనమండలి సభ్యుడు భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డిని కలిశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలపై కార్యాచరణ సి ద్ధం చేసేలా ప్రభుత్వాన్ని ఒప్పించాలని విన్నవించారు. ఎనటీఏ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు రెడ్డిరమేశబాబు, రాష్ట్ర కార్యదర్శి సురేశకుమార్‌, రాష్ట్ర కౌన్సిలర్‌ అబ్దుల్‌ గఫార్‌, కడప జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏబీ రామకృష్ణమరాజు, రామసుబ్బన్న, జిల్లా గౌరవాధ్యక్షుడు కూరాకు రవీంద్ర, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Mar 28 , 2025 | 12:01 AM