తాగునీటి సమస్య లేకుండా చూస్తాం
ABN , Publish Date - Mar 30 , 2025 | 11:53 PM
ప్రతి గ్రామంలోనూ తాగునీటి సమస్య తలెత్తకుండా చూస్తామని విజిలెన్స అండ్ క్వా లిటీ కంట్రోలర్ డీఈకేసీ జాకోపాల్ పేర్కొన్నారు.

లక్కిరెడ్డిపల్లె,మార్చి30(ఆంధ్రజ్యోతి): ప్రతి గ్రామంలోనూ తాగునీటి సమస్య తలెత్తకుండా చూస్తామని విజిలెన్స అండ్ క్వా లిటీ కంట్రోలర్ డీఈకేసీ జాకోపాల్ పేర్కొన్నారు. ఆదివారం బీ.యర్రగుడి, బురుజుపల్లి, చౌటపల్లి, అనంతపురం గ్రామాల్లో రెండు నెలల క్రితం మంచినీటి పథకం బోర్లు వేసినా వాటికి మోటార్లు అమర్చి పైపులైన్లు ఏర్పాటు చేసి కుళాయి ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామన్నా రు. మంచినీటి పథకం బోర్ల నుంచి పైపులైన్ల ద్వారా అమర్చిన పనులను ఆయన పరిశీలించారు. ఆర్‌డబ్ల్యుఎ్‌స ఏఈ కిశోర్, సిబ్బంది పాల్గొన్నారు.