Share News

రెస్టారెంట్లలో అధికారుల తనిఖీ

ABN , Publish Date - Mar 25 , 2025 | 12:37 AM

బెంజిసర్కిల్‌ పరిధిలోని పలు రెస్టారెంట్లలో సోమవారం వీఎంసీ అగ్నిమాపక నిరోధక అధికారులు, సిబ్బంది ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు.

రెస్టారెంట్లలో అధికారుల తనిఖీ
రెస్టారెంట్‌లో ఫైర్‌ సేప్టీపై సిబ్బంది నుంచి వివరాలు సేకరిస్తున్న అధికారులు

రెస్టారెంట్లలో అధికారుల తనిఖీలు

సరైన అగ్నినిరోధక పరికరాలు లేకపోవడంపై ఆగ్రహం

బెంజిసర్కిల్‌, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): బెంజిసర్కిల్‌ పరిధిలోని పలు రెస్టారెంట్లలో సోమవారం వీఎంసీ అగ్నిమాపక నిరోధక అధికారులు, సిబ్బంది ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఆర్‌ఆర్‌ దర్బార్‌, రాజాదర్బార్‌, సదరన్‌ స్పైస్‌, కడియపట్టణం రెస్టారెంట్‌లు, హోటల్స్‌లో తనిఖీలు చేశారు. పలు రెస్టారెంట్లలో సరైన అగ్నినిరోధక పరికరాలు లేకపోడంపై అధికారులు రెస్టారెంట్‌ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు, ఉపయోగించే విధానం, మంటలను ఎలా ఆర్పాలి, ఎటువంటి పరికరాలు వినియోగించాలి, ఫైర్‌ స్పింక్లర్స్‌, స్మోక్‌ డిటెక్టర్స్‌ ఎక్కడెక్కడ అమర్చాలి అన్న విషయాలపై అవగాహన కల్పించారు. ఈ తనిఖీల్లో జిల్లా ఫైర్‌ ఆఫీసర్‌ మాల్యాద్రి, రీజినల్‌ ఫైర్‌ ఆఫీసర్‌ వెంకటేశ్వరరావు, స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌ రాజా పాల్గొన్నారు.

Updated Date - Mar 25 , 2025 | 12:37 AM