New software: ఆన్‌లైన్ మోసాలకు ఇక అడ్డుకట్ట..
ABN , Publish Date - Mar 29 , 2025 | 08:06 AM
ఆన్‌లైన్ మోసాలకు ఇక అడ్డుకట్ట పడనుందా అంటే.. అవునంటున్నారు సాంకేతిక నిపుణులు. ఇందుకు సంబంధించి ఒడిస్సీ టెక్నాలజీస్ కొత్త సాఫ్ట్‌వేర్లను రూపొందించినట్లు, తద్వారా ఈ తరహ మోసాలకు అతి త్వరలోనే చెక్ పడబోతున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలునుతున్నారు.

- కొత్త సాఫ్ట్‌వేర్లను రూపొందించిన ఒడిస్సీ టెక్నాలజీస్
హైదరాబాద్: డిజిటల్ యుగంలో భద్రతా పరంగా ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు చెన్నై(Chennai)కి చెందిన ఒడిస్సీ టెక్నాలజీస్ లిమిటెడ్(Odyssey Technologies Limited) రెండు కొత్త సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్‌లను అందుబాటులోకి తెచ్చింది. ఆన్‌లైన్ వేదికగా శుక్రవారం వీటిని విడుదల చేసింది. డిజిటల్ కమ్యూనికేషన్‌లో ఈ ప్రొడక్ట్‌లు సరికొత్త విప్లవమని, వీటితో ఆన్‌లైన్ మోసాలకు అడ్డుకట్ట వేయవచ్చని ఆ సంస్థ సీఎండీ రాబర్ట్ రాజా తెలిపారు. ఎక్స్‌జోర్కీసైన్ మెయిల్, ఎక్స్‌జోర్కీసైన్ స్పాట్ పేర్లతో వీటిని మార్కెట్లో ప్రవేశపెట్టారు. ‘డిజిటల్ అరెస్ట్’, స్కామ్‌లు, ఆన్‌లైన్ ఐడెంటిటీ థెప్ట్, ఎక్స్‌టార్షన్, రాన్సమ్‌వేర్ దాడులను ఈ సాఫ్ట్‌వేర్లతో అడ్డుకోవచ్చని అన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Asaduddin Owaisi: ఆర్ఎస్ఎస్పై విరుచుకుపడ్డ ఎంపీ అసదుద్దీన్.. ఆయన ఏమన్నారంటే..
అప్లికేషన్స్ పనితీరు ఇలా..
ఎక్స్‌జోర్కీసైన్ మెయిల్ అనేది బ్రౌజర్ లేదా మెయిల్ క్లయింట్ కోసం రూపొందించిన ఎక్స్‌టెన్షన్ సాఫ్ట్‌వేర్. ఈమెయిళ్లలో డిజిటల్ సైన్‌తో వచ్చే వాటిని ధ్రువీకరించడానికి ఉపయోగపడుతుంది. ఎక్స్‌జోర్కీసైన్ స్పాట్ అనేది మొబైల్ యాప్. దీని ద్వారా ఎస్‌ఎంఎస్, ఇతర సందేశాలకు డిజిటల్ సైన్ చేయవచ్చు.
ఒక యూజర్ తన గుర్తింపును నిరూపించుకోవడానికి కూడా ఇది దోహద పడుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ రెండింటితో పాటు కార్పొరేట్ సంస్థల కోసం అలాట్రసైన్ ఎంటరైప్రైజ్ సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్ చేసినట్లు రాబర్ట్ రాజా వివరించారు. డిజిటల్ సంతకం చేసిన మెయిళ్లు, ఎస్‌ఎంఎస్‌లను పెద్ద సంస్థలు ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా మిలియన్ల సంఖ్యలో తమ కస్టమర్లకు పంపగలుగుతారని ఆయన వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
హైడ్రా, మూసీ పేరుతో మూటలు కడుతున్న కాంగ్రెస్ గద్దలు
కిలాడీ లేడీ అరెస్టు.. బయటపడ్డ ఘోరాలు..
ఆ క్రెడిట్ వారు తీసుకున్నా ఏం కాదు..
పాఠశాలకు వెళ్లే విద్యార్థినిలే లక్ష్యం.. డ్రగ్స్ ఇచ్చి కామాంధులకు బేరం..
Read Latest Telangana News and National News