RBI: ఏటీఎం లావాదేవీలు మరింత భారం
ABN , Publish Date - Mar 29 , 2025 | 07:29 AM
ఆర్‌బీఐ, బ్యాంకులకు ఉచిత లావాదేవీ పరిమితి దాటి చేసే ప్రతి లావాదేవీపై యూసేజ్ చార్జీని రూ.2 వంతున పెంచేందుకు అనుమతించింది. మే 1 నుండి ఈ కొత్త నిబంధన అమలులోకి రానున్నట్లు ఆర్‌బీఐ వెల్లడించింది

మే 1 నుంచి చార్జీలు పెంపు
ఏటీఎం లావాదేవీలు మరింత భారం
ముంబై: ఏటీఎం నుంచి ఎలాంటి చార్జీలు లేకుండా ఉచితంగా నగదు విత్‌డ్రా చేసుకునేందుకు ఇచ్చిన గరిష్ఠ పరిమితి దాటిన అనంతరం చేసే ప్రతి లావాదేవీ పైన యూసేజ్ చార్జీ రూ.2 వంతున పెంచేందుకు బ్యాంకులకు ఆర్‌బీఐ అనుమతించింది. దీంతో ఇక నుంచి అలాంటి ప్రతి లావాదేవీ పైన రూ.23 యూసేజ్ చార్జి పడుతుంది. మే 1 నుంచి యూసేజ్ చార్జి రూ.2 వంతున పెంచేందుకు అనుమతించినట్టు ఆర్‌బీఐ తెలిపింది. ప్రస్తుతం బ్యాంకులు ఉచిత పరిమితి దాటి చేసే ఒక్కో లావాదేవీపై రూ.21 చార్జి చేస్తున్నాయి. బ్యాంక్ కస్టమర్లు ప్రతి నెలా తమ సొంత బ్యాంక్ ఏటీఎంల నుంచి ఐదు ఉచిత లావాదేవీలు (ఆర్థిక, ఆర్థికేతర) నిర్వహించుకునేందుకు అనుమతిస్తున్నారు. ఇతర బ్యాంకుల ఏటీఎం నుంచైతే ఉచిత లావాదేవీల సంఖ్య (ఆర్థిక, ఆర్థికేతర) మెట్రో నగరాల్లో 3కే పరిమితం చేశారు. మిగతా ప్రాంతాల్లో ఐదు లావాదేవీలను అనుమతిస్తారు. నగదు రీ సైక్లర్ మెషీన్‌లో చేసే లావాదేవీలకు కూడా ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపింది.