Share News

వక్ఫ్‌ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నల్లబ్యాడ్జీలతో నిరసన

ABN , Publish Date - Mar 29 , 2025 | 12:36 AM

కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న వక్ఫ్‌ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని జమాతే ఇస్లాం హింద్‌ రాష్ట్ర అధ్యక్షుడు రఫిక్‌ డిమాండ్‌ చేశారు.

వక్ఫ్‌ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా   నల్లబ్యాడ్జీలతో నిరసన
లబ్బీపేటలోని మసీదు వద్ద నల్లబ్యాడ్జీలతో జమాతే ఇస్లాం హింద్‌ నిరసన

వక్ఫ్‌ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా

నల్లబ్యాడ్జీలతో నిరసన

నేడు ధర్నాచౌక్‌ వద్ద శాంతియుత ప్రదర్శన

లబ్బీపేట, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న వక్ఫ్‌ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని జమాతే ఇస్లాం హింద్‌ రాష్ట్ర అధ్యక్షుడు రఫిక్‌ డిమాండ్‌ చేశారు. ముస్లిం పర్సనల్‌ లా బోర్డు సూచనలతో శుకవ్రారం లబ్బీపేటలోని మసీదు వద్ద ప్రార్థనల అనంతరం వక్ఫ్‌ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిల్లుకు వ్యతిరేకంగా శనివారం ధర్నా చౌక్‌ వద్ద శాంతియుత ప్రదర్శన నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో ఉలేమాలు, మత పెద్దలు, ముస్లిం సమాజానికి చెందిన వారు పాల్గొంటారని, వామపక్ష నేతలు, సెక్యులర్‌ సిద్ధాంతాల మేధావులు పాల్గొంటారని తెలిపారు. సెక్యులర్‌ భావాలు కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు తమకు మద్దతు ఇస్తారని, పార్లమెంటు ఉభయసభల్లో కూడా టీడీపీ వ్యతిరేకంగా ఓటు వేస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు మత పెద్దలు పాల్గొన్నారు.

Updated Date - Mar 29 , 2025 | 12:36 AM