Share News

Hyderabad Popeyes Store: విస్తరణ బాటలో పొపయిస్‌

ABN , Publish Date - Mar 29 , 2025 | 07:27 AM

జుబిలెంట్‌ ఫుడ్‌వర్క్స్‌ లిమిటెడ్‌ స్వంతంగా నిర్వహించే పొపయిస్‌ బ్రాండ్‌ తన కార్యకలాపాలను హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. 61 స్టోర్లను నిర్వహిస్తున్న సంస్థ, వచ్చే ఏడాది కాలంలో వీటి సంఖ్యను 100కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది

Hyderabad Popeyes Store: విస్తరణ బాటలో పొపయిస్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): జుబిలెంట్‌ ఫుడ్‌వర్క్స్‌ లిమిటెడ్‌ నిర్వహణలోని అంతర్జాతీయ ఫ్రైడ్‌ చికెన్‌ బ్రాండ్‌ పొపయిస్‌.. హైదరాబాద్‌ సహా దేశీయంగా తన కార్యకలాపాలు విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. శుక్రవారం నాడిక్కడ కొత్త స్టోర్‌ను ప్రారంభించిన సందర్భంగా పొపయిస్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ గౌరవ్‌ పాండే మాట్లాడుతూ.. ప్రస్తుతం సంస్థ దేశవ్యాప్తంగా 20కి పైగా నగరాల్లో స్టోర్లను నిర్వహిస్తోందని చెప్పారు. కార్యకలాపాల విస్తరణలో భాగంగా తాజాగా హైదరాబాద్‌లో కొత్త స్టోర్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. పొపయిస్‌ ఇప్పటికే ఇక్కడ రెండు స్టోర్లను నిర్వహిస్తోంది. కాగా వచ్చే ఏడాదిన్నర కాలంలో ఈ స్టోర్ల సంఖ్యను 10కి చేర్చాలని చూస్తున్నట్లు పాండే వెల్లడించారు. మరోవైపు దేశవ్యాప్తంగా పొపయిస్‌ 61 స్టోర్లను నిర్వహిస్తుండగా వచ్చే ఏడాది కాలంలో వీటి సంఖ్యను 100కి చేర్చాలని చూస్తున్నట్లు చెప్పారు. రవాణా సదుపాయాలు మెరుగుపడిన తర్వాత విజయవాడ, విశాఖపట్నం నగరాలకు విస్తరించాలని చూస్తున్నట్లు పాండే చెప్పారు.

Updated Date - Mar 29 , 2025 | 07:31 AM