సీనియారిటీకి దక్కిన గౌరవం
ABN , Publish Date - Mar 29 , 2025 | 12:52 AM
మార్కె ట్ కమిటీ చైర్మన్‌గా టీడీపీ సీనియర్ నాయకుడు పొట్లూరి రవికుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

గుడ్లవల్లేరు ఏఎంసీ చైర్మన్‌గా పొట్లూరి రవికుమార్ నియామకం
గుడ్లవల్లేరు, మార్చి 28(ఆంధ్రజ్యోతి): మార్కె ట్ కమిటీ చైర్మన్‌గా టీడీపీ సీనియర్ నాయకుడు పొట్లూరి రవికుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అన్ని వర్గాల ప్రజలతో మమేకమై కలుపుకొని వెళ్లే వ్యక్తిగా రవికుమార్‌కు పేరుంది. గుడ్లవల్లేరు ప్రాథమిక వ్యవ సాయ సంఘం అధ్యక్షుడిగా విధులు నిర్వహించిన అనుభవం సంఘాన్ని లాభాల బాటలో నిలిపిన సమర్థత ఉండటంతో ఆయనను ఈ పదవికి ఎం పిక చేశారు. పార్టీ మండల అధ్యక్షుడు కొసరాజు బాపయ్య చౌదరి, సీనియర్ నాయకులు వల్లభనేని వల్లభనేని బాబూరావు, వల్లభనేని వెంకటరావు మరికొందరు నాయకులు ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు సిఫార్సుచేయగా ఆయన అధిష్టానానికి సూచించారు. రవి పేరు ప్రకటించడంపై మండల నేతలు హర్షం వ్యక్తం చేశారు. పలువురు నాయకులు, కార్యకర్తలు ఆయనను అభినందించారు.