Share News

Asaduddin Owaisi: ఆర్ఎస్ఎస్‏పై విరుచుకుపడ్డ ఎంపీ అసదుద్దీన్‌.. ఆయన ఏమన్నారంటే..

ABN , Publish Date - Mar 29 , 2025 | 07:38 AM

హైదరాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు అసదుద్దీన్‌ ఒవైసీ భారతీయ జనతా పార్టీ, దాని అనుబంధ ఆర్ఎస్ఎస్‏పై విరుచుకుపడ్డారు. భారత రాజ్యాంగానికి భవిష్యత్‌లో ఆర్‌ఎస్ఎస్‌ భావజాలంతోనే ముప్పు పొంచి ఉందటూ అసద్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయాల్లో పెను దుమారానికి కారణమయ్యాయి.

Asaduddin Owaisi: ఆర్ఎస్ఎస్‏పై విరుచుకుపడ్డ ఎంపీ అసదుద్దీన్‌.. ఆయన ఏమన్నారంటే..

- ఆర్‌ఎస్ఎస్‌ భావజాలంతో దేశానికి ముప్పు

- మజ్లిస్‌ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ

హైదరాబాద్‌: భారత రాజ్యాంగానికి భవిష్యత్‌లో ఆర్‌ఎస్ఎస్‌ భావజాలంతోనే ముప్పు పొంచి ఉందని మజ్లిస్‌ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు అసదుద్దీన్‌ ఒవైసీ(Asaduddin Owaisi) ఆరోపించారు. దేశంలో హిందువులతో ముస్లింలకు కానీ.. ముస్లింలతో హిందువులకు కాని ఎలాంటి ముప్పు లేదని.. కేవలం ఆర్‌ఎసఎస్‌ భావజాలాన్ని అమలుచేస్తోన్న బీజేపీ, నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగిల నుంచే ప్రమాదం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ వార్తను కూడా చదవండి: KCR: తెలంగాణపై కుట్రలు.. కేసీఆర్ షాకింగ్ కామెంట్స్


పవిత్ర రంజాన్‌ మాసం చివరి శుక్రవారం జుమ్మాతుల్‌ విదా ప్రార్థనల అనంతరం ఫతే దర్వాజా వజీర్‌ అలీ మసీదులో ఏర్పాటు చేసిన యౌముల్‌ ఖురాన్‌ కార్యక్రమంలో అసదుద్దీన్‌ ఒవైసీ ప్రసంగిస్తూ.. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేకంగా వక్ఫ్‌ సవరణ బిల్లును ప్రవేశపెట్టిందని విమర్శించారు. బీజేపీ మోదీ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన చంద్రబాబు నాయుడు(తెలుగుదేశం), నీతీ్‌షకుమార్‌(జేడీయూ), చిరాగ్‌ పాశ్వాన్‌(ఎల్‌జేపీ-రాం విలాస్‌ పాశ్వాన్‌), జయంత్‌చౌదరి(ఆర్‌ఎల్‌డీ)లను భారతీయ ముస్లింలు విశ్వసించరని స్పష్టం చేశారు.


ముస్లింల గుండెలకు తుపాకీ ఎక్కు పెట్టినట్టుగా మారిన వక్ఫ్‌ సవరణ చట్టానికి మద్దతు ఇచ్చి, వారి ఆస్తులను లాక్కునేందుకు మద్దతు ఇచ్చిన పార్టీల నేతలను ముస్లింలు ఎప్పటికీ క్షమించరని అన్నారు. దేవాలయాల ట్రస్ట్‌ బోర్డులో హిందువులు, గురుద్వారా బోర్డుల్లో సిక్కులు మాత్రమే సభ్యులుగా ఉండాలనే నిబంధనలు అమలు చేస్తున్న నేపథ్యంలో వక్ఫ్‌బోర్డుల్లో ముస్లిమేతరుల ప్రమేయాన్ని ఎలా అంగీకరిస్తారని ఒవైసీ ప్రశ్నించారు.


city1.2.jpg

వక్ఫ్‌ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నల్లబ్యాడ్జీలతో నిరసనలు తెలపాలని ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు ఇచ్చిన పిలుపు మేరకు ఒవైసీతో పాటు ముస్లింలు చేతికి నల్లరంగు రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఆర్‌ఎ్‌సఎస్‌ భావజాలాన్ని అనుసరిస్తున్న బీజేపీ, మోదీ, యోగిలతో దేశానికి ముప్పు ఉందని విమర్శించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

హైడ్రా, మూసీ పేరుతో మూటలు కడుతున్న కాంగ్రెస్‌ గద్దలు

కిలాడీ లేడీ అరెస్టు.. బయటపడ్డ ఘోరాలు..

ఆ క్రెడిట్ వారు తీసుకున్నా ఏం కాదు..

పాఠశాలకు వెళ్లే విద్యార్థినిలే లక్ష్యం.. డ్రగ్స్ ఇచ్చి కామాంధులకు బేరం..

Read Latest Telangana News and National News

Updated Date - Mar 29 , 2025 | 07:38 AM