నీటి నిల్వలు కాపాడుకోవాలి
ABN , Publish Date - Mar 23 , 2025 | 12:21 AM
వాతావరణంలో వస్తున్న మార్పులను గమనిస్తూ నీటి నిల్వలను కాపాడుకుంటేనే మానవ మనుగ డకు ఇబ్బంది లేకుండా ఉంటుందని లేకుంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుందని ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.భాగ్యలక్ష్మి తెలిపారు.

నీటి నిల్వలు కాపాడుకోవాలి
ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల విద్యార్థుల ర్యాలీ
గుణదల, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): వాతావరణంలో వస్తున్న మార్పులను గమనిస్తూ నీటి నిల్వలను కాపాడుకుంటేనే మానవ మనుగ డకు ఇబ్బంది లేకుండా ఉంటుందని లేకుంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుందని ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.భాగ్యలక్ష్మి తెలిపారు. ప్రపంచ నీటి సంరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నీటి సంరక్షణ-మంచు కొండలను కాపాడుకోవడం అనే అంశంపై ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు శనివారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ప్రధానంగా ప్లాస్టిక్ వాడకం తగ్గాలని చెప్పారు. నీటిని అవసరాలకు తగ్గట్టుగా పొదుపుగా వాడుకోవాలని చెప్పారు. ఇంకుడు గుంతలను ప్రతి ఒక్కరూ ఏర్పాటు చేసుకుంటే నీటి నిల్వలను పెంచవ చ్చన్నారు. యువత మొక్కలను పెంచి వాతావరణంలో పెరిగిపోతున్న కాలు ష్యాన్ని తగ్గించేందుకు దోహదపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో రసాయన శాస్త్ర విభాగాధిపతి ఎస్.కె. బీబి, పీజీ కోఆర్డినేటర్ డాక్టర్ పి.సురేష్, రసాయనశాస్త్ర అధ్యాపకులు డాక్టర్ ఎన్.ఎల్.జానకి, డాక్టర్ ఎస్.ప్రియదర్శిని, డాక్టర్ జి.శైలజ, పి.మధులత, ఎం.జ్యోతి, జి.అనుష తదితరులు పాల్గొన్నారు.