పట్టపగలే దొంగతనాలు
ABN , Publish Date - Mar 25 , 2025 | 12:47 AM
పట్టణంలోని రైతుపేట కాకతీయ పాఠశాల సమీపంలోని రెండు ఇళ్లలో పట్టపగలు దొంగలు చొరబడ్డారు.

ఓ ఇంట్లో రూ.1.70 లక్షలు అపహరణ..మరో ఇంటి తాళం పగులగొట్టిన దొంగ
నందిగామ, మార్చి 24(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని రైతుపేట కాకతీయ పాఠశాల సమీపంలోని రెండు ఇళ్లలో పట్టపగలు దొంగలు చొరబడ్డారు. గుంటుపల్లి సదాశివరావు అనే ఉపాధ్యాయడు భార్యతో కలిసి పుణ్యక్షేత్రాలకు వెళ్లారు. సోమవారం ఉదయం 11 గంటలకు ఓ దొంగ ఇంటి తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించాడు. బీరువా పగుల గొట్టి రూ.1.70 లక్షల నగదు అపహరించాడు. అక్కడ నుంచి బయటకు వచ్చి సమీపంలో ఉన్న మరో ఇంటి తాళం పగులగొట్టాడు. ఆ ఇంట్లో ఏమీ చోరీ చేయలేదు. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన ఉపాధ్యాయుడు సదాశివరావు తలుపులు పగులగొట్టి ఉండడం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై అభిమన్యు సిబ్బందితో వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీసీ కెమెరాలను పరిశీలించారు. క్లూస్ టీమ్ సభ్యులు ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు ఆయన తెలిపారు.