Share News

అయ్యో పాపం

ABN , Publish Date - Mar 25 , 2025 | 12:51 AM

భార్యాభర్తల మధ్య గొడవ ఓ పసిప్రాణాన్ని చిదిమేసింది. భర్తతో గొడవపడిన భార్య తన నాలుగేళ్ల చిన్నారితో బావిలో దూకగా, చిన్నారి మృతిచెందగా, తల్లి ప్రాణాలతో బయటపడింది.

అయ్యో పాపం
నాలుగేళ్ల శ్రావణి (ఫైల్‌)

భర్తతో గొడవపడి నాలుగేళ్ల చిన్నారితో ఓ తల్లి ఆత్మహత్యాయత్నం

పాప మృతి.. క్షేమంగా బయటపడిన తల్లి

వత్సవాయి, మార్చి 24 (ఆంధ్రజ్యోతి) : భార్యాభర్తల మధ్య గొడవ ఓ పసిప్రాణాన్ని చిదిమేసింది. భర్తతో గొడవపడిన భార్య తన నాలుగేళ్ల చిన్నారితో బావిలో దూకగా, చిన్నారి మృతిచెందగా, తల్లి ప్రాణాలతో బయటపడింది. వివరాల్లోకి వెళితే.. వత్సవాయి మండలం కన్నెవీడు గ్రామానికి చెందిన కొత్తపల్లి లక్ష్మీనారాయణకు నందిగామ మండలం ముప్పాళ్ల గ్రామానికి చెందిన లక్ష్మీతో పదేళ్ల కిందట వివాహమైంది. వీరికి నాలుగేళ్ల పాప ఉంది. లక్ష్మీనారాయణ పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి గ్రామంలో ఓ ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నాడు. స్వగ్రామం కన్నెవీడులో ఉన్న తన తల్లిదండ్రులను చూసేందుకు భార్య, కూతురుతో కలిసి శనివారం వచ్చాడు. భార్యాభర్తల మధ్య స్వల్ప విషయంపై ఆదివారం రాత్రి వివాదం చోటుచేసుకుంది. మనస్తాపానికి గురైన లక్ష్మి పాపతో కలిసి ఊరి బయట ఉన్న బావిలో దూకేసింది. కొందరు యువకులు వారిని రక్షించే ప్రయత్నం చేశారు. అప్పటికే చిన్నారి మృతిచెందగా, లక్ష్మి ప్రాణాలతో బయటపడింది.

Updated Date - Mar 25 , 2025 | 12:51 AM