ఉపాధి వేతనాలు చెల్లించాలి
ABN , Publish Date - Mar 21 , 2025 | 11:39 PM
తమకు వేతనాలు ఇవ్వాలని ఉపాధి కూలీలు రోడ్డెక్కి భిక్షాటన చేశారు. శుక్రవారం కార్మిక సంఘం నాయకులతో కలిసి గ్రామాలకు చెందిన ఉపాధి హమీ కూలీలు భీమాస్ సర్కిల్ నుంచి శ్రీనివాస్ భవన్ వరకు భిక్షాటన చేశారు. జనవరి నుంచి ఇంతవరకు కూలీ చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆదోని, పత్తికొండ, దేవనకొండలో ఉపాధి కూలీల భిక్షాటన
ఆదోని రూరల్, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): తమకు వేతనాలు ఇవ్వాలని ఉపాధి కూలీలు రోడ్డెక్కి భిక్షాటన చేశారు. శుక్రవారం కార్మిక సంఘం నాయకులతో కలిసి గ్రామాలకు చెందిన ఉపాధి హమీ కూలీలు భీమాస్ సర్కిల్ నుంచి శ్రీనివాస్ భవన్ వరకు భిక్షాటన చేశారు. జనవరి నుంచి ఇంతవరకు కూలీ చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం పనిచేసిన 15 రోజుల్లోపే వేతనాలు చెల్లించాల్సి ఉండగా, ఇంతవరకు చెల్లించకపో వడం ఏమిటని ప్రశ్నించారు. అధికారులు స్పందించకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
పత్తికొండ టౌన్: ఉపాధి కూలీల పెండింగ్ వేతనాలు చెల్లించాలని సీపీఎం మండల కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి, వ్యవసాయ సంఘం నాయకులు నరసన్న, దస్తగిరి డిమాండ్ చేశారు. శుక్రవారం వ్యవసాయ కార్మిక సంఘం ఽఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి, అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఉసేని, శిఖామణి, భాషా, హుశేన్‌బీ, హసీనా పాల్గొన్నారు
దేవనకొండ: ఉపాధి కూలీల వేతనాలు చెల్లించాలని సీపీఎం నాయకులు శుక్రవారం భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. వ్యవసాయ కార్మికసంఘం అధ్వర్యంలో బస్టాండ్ అవరణలో భిక్షాటన చేశారు. పది వారాలుగా వేతనాలు మంజూరు కాకపోతే కూలీలు ఏలా బ్రతకాలని సంఘం జిల్లా అధ్యక్షుడు వీరశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వాల నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతుందన్నారు. మండల కార్యదర్శి మహబుబ్ బాష, ఆశోక్, బజారి పాల్గొన్నారు.