Share News

శ్రీగిరికి పోటెత్తిన భక్తులు

ABN , Publish Date - Mar 23 , 2025 | 01:12 AM

శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయం శనివారం భక్తులతో కిక్కిరిసిసోయింది.

శ్రీగిరికి పోటెత్తిన భక్తులు
భక్తులతో కిటకిటలాడుతున్న శ్రీశైలం

శ్రీశైలం, మార్చి 22(ఆంధ్రజ్యోతి): శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయం శనివారం భక్తులతో కిక్కిరిసిసోయింది. ఈనెల 27 నుంచి ఉగాది ఉత్సవాల నేపథ్యంలో కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వేల సంఖ్యలో భక్తులు శ్రీశైలం చేరుతున్నారు. దీనితో క్షేత్ర ప్రధాన వీధులలో భక్తుల రద్దీ భారీగా కనిపిస్తోంది. అలాగే దేవస్థానం వారు ఏర్పాటు చేసి క్యూ కాంప్లెక్స్‌, ఆలయంలోని క్యూలైన్లు భక్తు లతో కిక్కిరిసిపోయాయి. ఉచిత దర్శనానికి 5 గంటలు శీఘ్ర దర్శనానికి 3గంటలు, అతి శీఘ్ర దర్శనానికి 2గంటలు సమయం పడుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Updated Date - Mar 23 , 2025 | 01:12 AM