Share News

పిల్లలకు రక్షణగా పోక్సో

ABN , Publish Date - Mar 23 , 2025 | 01:26 AM

బాలబాలికలకు రక్షణగా పొక్సో యాక్టు పని చేస్తుందని డీసీపీవో శారద అన్నారు.

పిల్లలకు రక్షణగా పోక్సో
మాట్లాడుతున్న డీసీపీవో శారద

కర్నూలు హాస్పిటల్‌, మార్చి 22(ఆంధ్రజ్యోతి): బాలబాలికలకు రక్షణగా పొక్సో యాక్టు పని చేస్తుందని డీసీపీవో శారద అన్నారు. నగరంలోని పెద్దపాడులో వైజే, పోక్సో చట్టాలపై బాలపరీరక్షణ కమిటీ అవగాహన సదస్సు నిర్వహించింది. ఈ సందర్బంగా డీసీపీవో మాట్లా డుతూ బాలబాలికలపై జరుగుతున్న లైంగిక వేధింపులు లేకుండా చేసేందుకు 2012లో కేంద్ర ప్రభుత్వం పోక్సో యాక్టు తెచ్చిందని గుర్తు చేశారు. బాలబాలికలపై ఎక్కడైన లైంగిక నేరాలకు పాల్పడితే పిర్యా దులు చేయడానికి నేరుగా పోలీస్‌ స్టేషన వెళ్లకుండా ఆనలైన ద్వారా ఈ-బాక్స్‌ ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలోల లీగల్‌ కం ప్రొఫెషనల్‌ ఆఫీసర్‌ శ్రీలక్ష్మి, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ జమీలాబేగం, చోటియా బేగం, ప్రొటెక్షన ఆఫీసర్‌ పద్మ, సిబ్బంది నరసింహులు, శ్వేత, కీర్తి, రంగమ్మ పాల్గొన్నారు.

Updated Date - Mar 23 , 2025 | 01:27 AM