Share News

కోసిగి దొరల ఇంట్లో సినిమా షూటింగ్‌

ABN , Publish Date - Mar 23 , 2025 | 01:16 AM

కోసిగిలోని దొరల వంశస్థులకు చెందిన ఇంట్లో శనివారం పీపుల్‌ మీడియా ప్యాక్టరీ వారి ఆధ్వర్యంలో గరివిడి లక్ష్మి సినిమా షూటింగ్‌ చిత్రీకరించారు.

కోసిగి దొరల ఇంట్లో సినిమా షూటింగ్‌
సినిమా షూటింగ్‌లో పాల్గొన్న హీరోయిన ఆనంది

కోసిగి, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): కోసిగిలోని దొరల వంశస్థులకు చెందిన ఇంట్లో శనివారం పీపుల్‌ మీడియా ప్యాక్టరీ వారి ఆధ్వర్యంలో గరివిడి లక్ష్మి సినిమా షూటింగ్‌ చిత్రీకరించారు. సినిమా డైరెక్టర్లు, కొరియోగ్రాఫర్లు కీర్తిప్రసాద్‌, గౌరి నాయుడు జాము, టీజీ విశ్వప్రసాద్‌ ఆధ్వర్యంలో గరివిడి లక్ష్మి సినిమాను తెర కెక్కిస్తున్నారు. సినిమా షూటింగ్‌లో భాగంగా కోసిగి దొరల వంశస్థులైన శ్రీనివాసు దొర, మురళి దొర ఇంట్లో సర్పంచతో సీనకు సంబంధించి హీరోయిన ఆనందిపై సన్నివేశాన్ని చిత్రీకరించారు. సినిమా షూటింగ్‌ జరుగుతున్న విషయం తెలుసుకున్న కోసిగి ప్రజలతో పాటు వివిధ గ్రామాల ప్రజలు, కౌతాళం పెద్దకడుబూరు మండలాల నుంచి ప్రజలు తరలివచ్చారు. పది రోజులుగా కోసిగి, కౌతాళం తదితర ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి సినిమా షూటింగ్‌ను చిత్రీకరిస్తున్నట్లు డైరెక్టర్లు, కెమె రామెన్లు, కోరియాగ్రాఫర్లు తెలిపారు. సినిమా షూటింగ్‌లో కోసిగి వాసు లకు సినీ బృందం సభ్యులు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఎలాంటి అవాం ఛనీయ సంఘటనలు జరగకుండా ఏఎస్‌ఐ తిరుపాల్‌ నాయక్‌, కాని స్టేబుల్‌ మనోజ్‌గౌడు, పోలీసు బందోబస్తు నిర్వహించారు.

Updated Date - Mar 23 , 2025 | 01:16 AM