మంత్రాలయంలో కిక్కిరిసిన భక్తులు
ABN , Publish Date - Mar 23 , 2025 | 01:15 AM
రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులతో మంత్రాలయం కిక్కిరిసింది.

మంత్రాలయం, మార్చి 22(ఆంధ్రజ్యోతి): రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులతో మంత్రాలయం కిక్కిరిసింది. వేద పండి తుల మంత్రోచ్ఛరణాలు, మంగళవా యిద్యాల మధ్య రాఘవ్రేంద స్వామి మూల బృందావనానికి బంగారు కవచం సమర్పణతో పాటు విశేష పుష్పాంకరణ సేవచేశారు. శనివారం పాల్గుణ అష్టమి శుభదినాన్ని పుర స్కరించుకొని పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ఆఽధ్వర్యంలో పండితులు బృందావానానికి సుప్రభాతం, నిర్మల విసర్జనం, క్షీరాభిషేకం, తులసి అర్చన, విశేష పంచామృతాభిషేకం నిర్వహించారు. బంగారు, వెండి, పట్టువస్ర్తాలు, బెంగళూరు నుంచి తెచ్చిన ప్రత్యేక పుష్పాలు, బంగారు కవచంతో అలంకరించారు.