డిప్యూటీ సీఎంకు ఘన స్వాగతం
ABN , Publish Date - Mar 23 , 2025 | 01:25 AM
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవనకళ్యాణ్‌కు ఓర్వకల్లు ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం లభించింది.

ఓర్వకల్లు, మార్చి 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవనకళ్యాణ్‌కు ఓర్వకల్లు ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం లభించింది. శనివా రం ఓర్వకల్లు మండలంలోని పూడిచెర్ల గ్రామంలో ఫారంపాండ్స్ నిర్మాణ పనులను ప్రారంభించేందుకు విచ్చేసిన డిప్యూటీ సీఎంకు ఓర్వకల్లు ఎయిర్ పోర్టులో నంద్యాల ఎంపీ బైౖరెడ్డి శబరి, డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, కలెక్టర్ రంజిత బాషా, ఎస్పీ విక్రాంత పాటిల్, పాణ్యం, డోన, కోడుమూరు, నందికొట్కూరు ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, బొగ్గుల దస్తగిరి, గిత్తా జయసూర్య, ట్రైనీ కలెక్టర్ చల్లా కళ్యాణి, టీటీడీ బోర్డు సభ్యుడు మల్లెల రాజశేఖర్, నందికొట్కూరు టీడీపీ ఇనచార్జి గౌరు వెంకటరెడ్డి, ఆయన తనయుడు గౌరు జనార్దన రెడ్డి, డీఎఫ్‌వో శ్యామల, ఎయిర్‌పోర్టు డైరెక్టర్ విద్యాసాగర్‌లు ఘన స్వాగతం పలికారు. విమానాశ్ర యానికి ఉదయం 10.10 గంటలకు చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో పూడిచెర్ల బహిరంగ సభకు బయలుదేరారు. అయితే.. రహదారి వనవే ఏర్పాటు చేసి వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. పూడిచెర్లలో ఫారంపాండ్స్ నిర్మాణ పనులను ప్రారంభించి బహిరంగ సభలో పాల్గొని అనంతరం సభను ముగించుకుని ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు మధ్యాహ్నం 12.56 గంటలకు పవనకళ్యాణ్ బయ లుదేరి వెళ్లారు. ఆయనకు కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యేలు వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పెరుగు పురుషోత్తంరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, పార్వతమ్మ, గోవిందరెడ్డి, మోహనరెడ్డి, పాలొకలను సుధాకర్‌రెడ్డి, బ్రాహ్మ ణపల్లె నాగిరెడ్డి, నాగేశ్వరరెడ్డి, మహబూబ్‌బాషా పాల్గొన్నారు.