పనులను వేగవంతం చేయాలి
ABN , Publish Date - Mar 23 , 2025 | 01:22 AM
డంప్ యార్డు పనులను వేగ వంతం చేయాలని సచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ అనిల్ కుమార్ రెడ్డి సూచించారు.

నంద్యాల మున్సిపాలిటీ, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): డంప్ యార్డు పనులను వేగ వంతం చేయాలని సచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ అనిల్ కుమార్ రెడ్డి సూచించారు. వచ్చే నెల 19 ముఖ్యమంత్రి నంద్యాల పర్యటన సందర్భంగా డంప్‌యార్డును పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను అనిల్ కుమార్ రెడ్డి శనివారం పరిశీలించారు. అనంతరం చిన్న చెరువు, పెద్ద చెరువులను పరిశీలించి పట్టణంలో నీటి సమస్య గురించి ఆరా తీశారు. కమిషనర్ నిరంజన్ రెడ్డి, మున్సిపల్ ఇంజనీర్ గుర్రప్ప యాదవ్, సహాయ కమిషనర్ వెంకటదాస్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ శివప్రసాద్ రెడ్డి తదీతరులు ఉన్నారు.
కలెక్టర్ చాంబర్‌లో కలెక్టర్ రాజకుమారిని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్‌కుమార్‌రెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. అదేవిధంగా ఖజానా శాఖ సంచాలకుడు మోహన్‌రావు కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు.